Site icon pvginox

అభివృద్ధి, సంక్షేమం సుస్థిర ప్రభుత్వం తోనే సాధ్యం.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

Spread the love

(pvginox.com By PALLA VENUGOPAL )

సుస్థిర పాలనతోనే అభివృద్ధి… సంక్షేమం సాధ్యం

• పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి
• రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ.. సుస్థిర పాలన కూటమి ప్రభుత్వ బాధ్యత
• గత ప్రభుత్వ చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాం
• దేశంలో అంతర్గత సుస్థిరత దెబ్బ తీసేవారిపై ఓ కన్నేసి ఉంచాలి
• విదేశీ శక్తుల అజెండాను మోస్తున్న వారిపట్ల అప్రమత్తత అవసరం
• అంతర్గత శత్రవులను ఓ కంట కనిపెట్టాలి
• ప్రధాని శ్రీ మోదీ గారు, సీఎం శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తాం
• ఏడాది పాలనలో సూపర్ సిక్స్ అమలు చేశాం
• వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తాం
• కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘రాష్ట్రం అభివృద్ధి జరగాలి.. సూపర్ సిక్స్ పథకాలు నిరాటంకంగా అమలుకావాలి.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. అందుకు సుస్థిరతతో కూడిన పాలన అవసరం. కూటమి ప్రభుత్వానికి శాంతి భద్రతల నిర్వహణ మీద, దేశ సుస్థితర మీద సమగ్ర అవగాహన ఉంది. దేశం లోపల అంతర్గత సుస్థిరతను దెబ్బ తీసేవారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ విషయంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అర్.డబ్ల్యూ.ఎస్, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నామన్నారు. విభజించు.. పాలించు అన్న బ్రిటీష్ రూల్ ని వారు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యునైటెడ్ రూల్ అమలు చేస్తోందని తెలిపారు. కలసి పాలన చేస్తూ.. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి–సంక్షేమాలను రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోందని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం సమర్పించారు. జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ పరేడ్ ను తిలకించారు. వివిధ శాఖల శకట ప్రదర్శన, చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విన్యాసాలు చూశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదల గారు అతిధుల గ్యాలరీ నుంచి ఈ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ఉత్తమ సేవా పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకటి రోజులు వస్తాయి. రాష్ట్రం కూడా 2019 నుంచి 2024 వరకు అలాంటి చీకటి రోజులను ఎదుర్కొంది. గత పాలకులు బ్రిటీషర్ల మాదిరి రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకుంటే.. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాం. ఆగస్ట్ 15ని ప్రతి ఒక్కరు గుండెల్లోతుల నుంచి స్వీకరించాలి. దేశ విభజన సమయంలో లాహోర్ పాకిస్థాన్ లో అంతర్భాగం అవుతుందని ఎవ్వరికీ తెలియదు. సడెన్ గా లాహోర్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మత ప్రాతిపధికన అక్కడ ఉన్న హిందువులను పంపివేసిన సమయంలో ఎన్నో దారుణాలు జరిగాయి. తమది అనుకున్న ప్రాంతం రాత్రికి రాత్రి పరాయి ప్రాంతం అయిపోతే ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం చాలా తేలికగా అహింసా మార్గంలో సాధించుకున్నామని అనుకుంటాం. కానీ స్వాతంత్ర్యం రావడానికి చాలా హింస జరిగింది. మనం ఎంచుకున్న విధానాలు అహింసా విధానాలు కావచ్చు. దేశం నుంచి విడిపోవాలి అనుకున్న వారు మాత్రం హింసనే నమ్మారు.

Exit mobile version