పల్లవి:-
మట్టిలో పుట్టిన మాణిక్యమా
వట్టి గానే వసంతంలా ఎంత చక్కగున్నావే…
నెట్టింటిలో అడుగుపెట్టినా మహాత్యమా
గట్టిగా నిలబడే సత్తువెంతో ఇక నీకుండాలమ్మా.!
పూసలమ్మిగా నవ్వుతు కనిపించిన స్వాతిముత్యమా
ఒక్కసారిగా ప్రపంచం గుండె తలుపు తట్టిలేపినావే..!
నిక్కచ్చిగా చెప్పాలంటే
దేవలోకం నుంచి జాలువారిన
పారిజాత పుష్పంలాగున్నావే…!
అందరు మెచ్చే
కొండా కోనల్లో గుప్పుమనే గుండు మల్లెవే..
పేద గుడిసెలో వికసించిన అందమైన రూపానివే
కుంభ మేళా పుష్కర వేద ఘోషలో
సరికొత్తగా ఉద్భవించిన మోనాలిసావే..!
మట్టిలో పుట్టిన మాణిక్యమా..!
చరణం:-
మబ్బులు వీడిన జాబిలమ్మా
నీ వెన్నెల నవ్వుల తేనే కళ్ళతో..
కాలాన్నంతా నీ వైపు చూసేలా చేసినావే..!
స్వచ్చమైన గంగానదివమ్మా
అచ్చమైన భారత నారిగా
ఇప్పుడే విచ్చుకున్న ముద్దమందారంలా
ఎంతో ఎంతెంతో మంచిగున్నావే..!
జనమంతా మనసంతా మెచ్చుకున్నా
మెరుపు తునకా
ఇక ముందు నీ గమ్యం ఎంతో సుందరమే
ఇక అంతా మంచి రోజులే
జగమంతా నీ స్నేహితులే…!
మొన్నా ఆ మొన్నా నీవేంటో నీకే తెలియదులే..
నిన్నా నేడు నువ్వేంటో లోకానికే అంతా తెలుసేనులే
ఎప్పుడూ ఏమి ఎట్లా ఎవరికి ఏమి చేయాలో
పై నున్న ఆ దేవుడికి ఎరుకేనని నీ విషయంలో ఋజువైయిందే రోజా పుష్షమా.!
పల్లవి:-
మట్టిలో పుట్టిన మాణిక్యమా
వట్టి గానే ఎంత సక్కంగున్నావే..!
చరణం:-
లోకం చూపంతా నీ పైనే
దిష్టి తీయించుకోవే అదృష్టమా
మాయలో పడకుండా నిష్టాగుండవే
అపూర్వమైనా అధ్భుతమా..!
దోషం ద్వేషం నీ చుట్టు చేరే ప్రమాదముందే
జర జాగరూకతో మసలుకోవే
తెల్లనివన్ని పాలని నల్లని వన్ని నీళ్ళనుకునే
అమాయకమే నీలో కనిపిస్తున్నాదే
ఆలోచించి అడుగెయ్యవే ఓ సోదరి
ఆ దేవుడు నిను సల్లంగా చూడాలి మరి!!
పల్లవి:-
మట్టి లో పుట్టిన మాణిక్యమా
వట్టి గానే వసంతంలా ఎంత సక్కంగున్నావే !!
