(విజయవాడ,09-09-2025,, pvginox.com)
- పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తున్నాం – వైసీపీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్
- రైతుల పక్షాన పోరాడితే కూటమి ప్రభుత్వానికి ఉలికెందుకు
- నీట మునిగిన పంట పొలాలను ఒక ప్రజాప్రతినిదైనా పర్సిలించారా
- నీట మునిగిన పంట పొలాలకు వెంటనే నష్టపరిహారం అందించాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలో గల నందిగామ లో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించి ఆర్డీవోకు శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకులు కార్యక్రమాన్ని తలపెడితే ఎన్టీఆర్ జిల్లా పోలీసుల చేత కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయని అన్నారు.యూరియా దొరకక రాష్ట్రవ్యాప్తంగా రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఎరువులు యూరియా బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి వందలాది రూపాయలు పెట్టి బ్లాక్లో కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా తెలిపారు.జగనన్న ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి తద్వారా రైతులకు కావలసినటువంటి ఎరువులు యూరియాను వారికి అందుబాటు ధరలలో ఇవ్వడం జరిగిందని నేడు ఆ రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేసి రైతుల జీవితాలతో ఈ కుటమి ప్రభుత్వం చలగాటమాడుతుందన్నారు.రైతులకు యూరియాను ఎరువులను అందుబాటులో ఉంచాలని బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని బ్లాక్ మార్కెట్లో ఈ యొక్క యూరియాను ఎరువులను అమ్ముతున్నటువంటి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్డిఓ కార్యాలయల వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో కి వినతి పత్రం అందించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున తలపెడితే దానిని ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధకాండ పెట్టి ఎక్కడికక్కడ కార్యక్రమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసిందన్నారు.రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే కూటమి ప్రభుత్వానికి అంత ఉలికెందుకన్నారు.ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.ఈ వర్షాకాలంలో ఎన్టీఆర్ జిల్లాలో వేల ఎకరాల పొలం నీట మునిగితే నేటికీ కూడా వారికి నష్టపరిహారం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.కనీసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని మంత్రులు గాని నీట మునిగినటువంటి పంట పొలాలను పరిశీలించారా అని ప్రశ్నించారు.అన్నదాత గోడును ఈ రాష్ట్ర ప్రభుత్వం వినకపోతే రానున్న రోజుల్లో రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు.
