జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అతికారి కృష్ణ గారు ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం సిద్ధవటం గ్రామం నందు భారీ ఎత్తున చెట్లు నాటినారు ఈ యొక్క కార్యక్రమంలో అతికారి కృష్ణ గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మనం అందించగల గొప్ప బహుమతి పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించి పర్యావరణ పరిరక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మొక్కలు నాటండి, నీటి కాలుష్యాన్ని నివారించండి మరియు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేద్దాం. మన పిల్లలకు గొప్ప మరియు శక్తివంతమైన సహజ ప్రపంచాన్ని అందిద్దాం అని చెప్పారు పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు ఆయనతోపాటు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు మరి కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
