(pvginox.com )
పీ4లో భాగంగా దత్తత తీసుకుని అవసరమైన సామగ్రి సమకూర్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు వర్షిత, యోగేంద్రకు దుస్తులు, పరుపు, దిండ్లు, దుప్పట్లు, చెప్పులు, ట్రంకుపెట్టె, పుస్తకాలు తదితర విద్యా సామగ్రి అందించిన సోమిరెడ్డి
ఉన్నత చదువుల వరకు అండగా ఉంటామని భరోసా
బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్ష
మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్
సీఎం చంద్రబాబు నాయుడు విజన్ తో చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నాను
ముత్తుకూరుకు చెందిన మల్లిక వర్షిత(7వ తరగతి), మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన చింతగుంట యోగేంద్ర(8వ తరగతి)…ఇద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు
గిరిజన బాలిక వర్షిత కాలి వేళ్లు నలిగిపోయివుండగా, టపాసులు కాలుస్తూ ఎస్సీ బాలుడు యోగేంద్ర చేతి వేళ్లు కోల్పోయాడు
ఈ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని గురుకుల పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టాను..అందులో భాగంగా వారికి అవసరమైన సామగ్రి అందజేశాను
ఇద్దరు చిన్నారులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను
గతంలో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో జన్మభూమి కార్యక్రమం చేపట్టారు
జన్మభూమి కార్యక్రమం అప్పట్లో విజయవంతంగా జరిగింది..ప్రజలకు రోడ్లు, భవనాలు వంటి వసతులు ఏర్పడినాయి
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను పీ4లో భాగస్వాముల్ని చేస్తున్నారు
పీ4లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజన కాలనీలను పామాయిల్ ఫ్యాక్టరీలు దత్తత తీసుకునేలా ప్రయత్నిస్తున్నాం
మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యాపరైన సహకారం ఇచ్చి గిరిజనుల స్థితిగతుల్లో మార్పులు తెచ్చే ప్రయత్నంలో దాతల సహకారాన్ని కోరుతున్నాం
పీ4 కార్యక్రమంలో భాగంగా మేం చేపట్టిన చర్యలకు ఫలితాలు వస్తున్నాయి
దేవరదిబ్బ గిరిజన కాలనీ చిన్నారులు బడికి వెళ్లడం కోసం SEIL కంపెనీ బస్సు ఏర్పాటు చేసింది
ముత్తుకూరు హైస్కూలును మోడల్ స్కూలుగా తీర్చిదిద్దే ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది..రెండు రోజుల్లో నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి స్కూలు పరిశీలనకు రాబోతున్నారు
సర్వేపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టాలని కోరుతున్నాం
పరిశ్రమల కాలుష్యం భరిస్తున్న మా ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేందుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని విన్నవిస్తున్నాం
