Site icon pvginox

మధురైలో డిప్యూటీ సీఎం పవన్ కు గ్రాండ్ వెల్కమ్

Spread the love

pvginox.com

మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మధురై చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నంవమధురై విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడు లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
బిజెపి తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చక్రవర్తి, రాష్ట్ర నాయకుడుశ్రీ అమర్ ప్రసాద్ రెడ్డి , మధురై జిల్లా అధ్యక్షులు శ్రీ మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ రాధాకృష్ణన్ తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Exit mobile version