తిరుపతి వికృతమలలోని శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ 20 పాయింట్స్ ప్రోగ్రాం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు దర్శించుకున్నారు.
శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారి ఆహ్వానం మేరకు లంకా దినకర్ గారు స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారిని హరిప్రసాద్ గారి సోదరుడు శ్రీ పసుపులేటి శివ ప్రసాద్ గారు హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
దేవాలయాన్ని సందర్శించిన అనంతరం దినకర్ గారు ఆలయ మహత్త్వం, ఇక్కడ జరిగే ఆరాధన, విశ్వాసం, భక్తుల కోరికలు తీర్చే స్వామివారి కరుణ గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం మనసును ఆనందపరుస్తుంది” అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఆనంద్, నగర నాయకులు భరత్, చందు తదితరులు పాల్గొని లంకా దినకర్ గారిని గౌరవపూర్వకంగా ఆహ్వానించారు.
