పంచాయతీ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
వీరులపాడు మండలం : మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీ ఛాంపియన్స్ మహిళలతో క్యాండిల్ నిర్వహించారు. సోమవారం వీరులపాడు మండలంలోని బోడవాడ, జమ్మవరం గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం నిర్వహించారు. అనంతరం మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించి సాధికారత దిశగా అడుగువేయాలని, ఇందుకోసం పంచాయతీ ఛాంపియన్స్ అవసరమైన సహకారం అందిస్తారని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్స్ జివి నరసింహారావు, సొంగా సంజయ్ వర్మ తెలిపారు. అదే విధంగా ఎంపి కేశినేని శివనాథ్ మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అభివృద్ది సాధించేందుకు అందిస్తున్న సహకారం గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జమ్మవరం టిడిపి అధ్యక్షుడు కిలారు వెంకట సత్యనారాయణ,బోడవాడ గ్రామ టిడిపి అధ్యక్షులు మద్దిలేని లక్ష్మణరావు, మండల సమైక్య అధ్యక్షురాలు సిహెచ్ కృష్ణకుమారి, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్స్ సొంగా సంజయ్ వర్మ, జివి నరసింహారావు, వీరులపాడు మండల జనసేన అధ్యక్షుడు బేతపూడి జయరాజ్,బోడవాడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గుంటి వీరయ్య , తాటి గుమ్మి గ్రామ టిడిపి సీనియర్ నాయకులు రోశయ్య, , బోడవాడ టిడిపి నాయకుడు రాయల సత్యం, పంచాయతీ ఛాంపియన్స్ కె.సునీల్, ఎస్.సురేష్, వై.ప్రదీప్, కె.రాము, హనుమంతరావు, గోపి, శ్రీను, జివి సత్యనారాయణ, కెవి నరసింహరావు లతో పాటు డ్వాక్రా సంఘ మహిళలు,అంగన్ వాడీకార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.