Site icon pvginox

విజయవాడ ఉత్సవ్ కు బాబా రాందేవ్.. ఎంపీ కేశినేని శివనాధ్

Spread the love

(ఢిల్లీ,09-09-2025, pvginox.com)

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో క‌లుసుకున్న‌ యోగా గురువు రామ్ దేవ్ బాబా, ఎంపీ కేశినేని శివ‌నాథ్
విజ‌య‌వాడ ఉత్స‌వ్ గురించి వివ‌రించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఎంపీ కేశినేని శివ‌నాథ్, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, యోగా గురువు రామ్ దేవ్ బాబా మంగ‌ళ‌వారం యాదృచ్ఛికంగా ఒక‌రినొక‌రు క‌లుసుకోవ‌టం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ సాంస్కృతిక వైభ‌వం దేశమంతా చాటిచెప్పేలా నిర్వ‌హించ‌నున్న విజ‌య‌వాడ ఉత్స‌వ్ గురించి రామ్ దేవ్ బాబా కు వివ‌రించి విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు రావాల్సిందిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ కోరారు. రామ్ దేవ్ బాబా సానుకూలంగా స్పందించ‌ట‌మే కాకుండా…విజ‌య‌వాడ ఉత్స‌వ్ జ‌రిగే ఆ 11 రోజుల్లో ఒక రోజు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌న్నారు.

యోగా గురువు రామ్ దేవ్ బాబా కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సోసైటీ ఫ‌ర్ వైబ్రెంట్ విజ‌య‌వాడ సార‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా విజ‌య‌వాడ ఉత్స‌వ్ సెప్టెంబ‌ర్ 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే ద‌స‌రా మ‌హోత్స‌వాల‌కు మ‌రింత వన్నె త‌చ్చే విధంగా సంస్కృతి సంప్ర‌దాయాలు, ఆధ్యాత్మిక‌త క‌లిసి ప‌ర్యాట‌కుల‌తో పాటు భ‌క్తులు, ప్ర‌జ‌లను అల‌రించే విధంగా విజ‌య‌వాడ ఉత్స‌వ్ వుంటుంద‌ని వివ‌రించారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ ఉత్స‌వ్ గురించి వివ‌రించిన అంశాల‌ను రామ్ దేవ్ బాబా చాలా ఆస‌క్తిగా ఆల‌కించారు.

Exit mobile version