Site icon pvginox

ఆంధ్రప్రదేశ్ 2వ జిల్లా కలెక్టర్ల సదస్సు: సమీక్ష

2nd day of District Collector Conference
Spread the love

అమరావతి రాజధాని నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ..

• అమరావతి అనేది ప్రజా రాజధాని.. అలాగే యువతకు ఉపాధి కల్పించే రాజధాని
• అలాగే విశాఖ, తిరుపతి, అమరావతి నగరాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుంది.
• నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
• ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
• ఒక కుటుంబం ఒక ఎంట్రప్రెన్యూర్ అనేది అమలు కావాలి.
• పలు నాలెడ్జీ ఎకానమీ యూనివర్శిటీలు ఇక్కడకు వస్తున్నాయి.
• ప్రపంచం లోని టాప్ 10 విశ్వ విద్యాలయాలు, టాప్ 10 ఆసుపత్రులు ఇక్కడకు రానున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ప్రెజెంటేషన్కె: K భాస్కర్ – సిఆర్డిఏ కమీషనర్

• అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి రూ. 20,500 కోట్ల సీఆర్డీఏ అథారిటీ ద్వారా పరిపాలనా ఆమోదం తీసుకోవడం జరిగింది.
• ఇప్పటి వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రూ. 31వేల కోట్ల టైఅఫ్ చేశాం.
• ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) నిన్న జరిగిన ఆ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి రాజధానికి రూ. 15000 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది.
• అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్లో గత ప్రభుత్వం 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా వారికి సంబంధిత జిల్లాల్లోనే ఇళ్ళు ఇచ్చేందుకు వీలుగా అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కోరారు.
• గత ఐదేళ్లు పనులను పట్టించుకోకపోవడం వల్ల రాజధాని నిర్మాణంలో సమస్యలు ఏర్పడ్డాయి.
• ప్రస్తుతం ఏపీ సీఆర్డీఏ పరిధిని యధాతద స్థితికి తీసుకురావడం జరిగింది

కలెక్టర్ల సదస్సులో పురపాలక&పట్టణ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు గారి ప్రసంగం


• గత కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో పురపాలక శాఖ పురోగతి, చేపట్టిన కార్యక్రమాలు, అర్బన్ ఆంధ్రప్రదేశ్, గ్రామీణ -పట్టణ ప్రాంతాల్లో జనాభా విస్తీర్ణం, ప్రాంతీయ విస్తీర్ణం తదితర అంశాలను వివరించడం జరిగింది..
• ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాము.
• రాష్ట్రవ్యాప్తంగా 7,83,443 ఇళ్లను వివిధ పథకాల క్రింద ప్రతిపాదించడం జరిగింది.
• వీటిలో 1,03,478 ఇళ్లు (13.2%) ఏడాది కాలంలో అమృత్ 1.0 కింద కవర్ చేయబడతాయి.
• 6,79,965 (86.8%) ఇళ్లు రెండేళ్లలో అమృత్ 2.0 కింద కవర్ చేయబడతాయి.
• ఇందుకోసం మౌలిక సదుపాయాల పెంపుతో పాటు 100% కార్యక్రమం అమలు చేసేందుకు రూ.5,034 కోట్ల నిధులు అవసరవుతాయని అంచనా వేశాము.
• సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా సంపద సృషికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
• పీపీపీ మోడ్‌లో డబ్ల్యూటీఈ/సీబీజీ ప్లాంట్లు.. పీఎస్‌యూల ద్వారా యుఎల్‌బిలలో సిబిజి ప్లాంట్‌ల ఏర్పాటు..
• అన్ని మున్సిపాలిటీల్లోనూ 100% వ్యర్థాల శుద్ధి. కాలువల శుభ్రం చేయడం
• సీజనల్ వ్యాధులను నివారించడానికి ఎస్వోపీ విధానం.
• నీరు & వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు 100% నివారణకు చర్యలు.
• వ్యాధి వ్యాప్తిని నివారించడానికి క్రమం తప్పకుండా నీటి పరీక్షలు నిర్వహించుట.
• దోమలు ప్రబలకుండా డ్రోన్ల ద్వారా లార్విసైడ్ చల్లడం, రోడ్ల నిర్వహణా చర్యలు చేపట్టడం.
• రహదారి నిర్వహణ కోసం యాన్యుటీ మోడల్ అమలు
• ఇప్పటికే కార్పొరేషన్లలో 642 కిలోమీటర్ల రోడ్లను గుర్తించారు.
• వీఎంసీ (విజయవాడ), జీవీఎంసీ (విశాఖపట్నం) లలో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి.
• అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేసే ప్రక్రియలో భాగంగా స్వయం సమృద్ధి విరాళాల కార్యక్రమం చేపట్టడం జరిగింది..
• 12.08.2024న అన్న క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్ట్ ACCT రిజిస్ట్రేషన్ నెం. 68/2024తో నమోదు చేయబడింది.
• IT చట్టం మరియు CSR కార్పొరేట్ సామాజిక బాధ్యత 12A మరియు 80G కింద పన్ను మినహాయింపు..
• ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్ల కొరకు రూ.8.20 కోట్ల విరాళాలు అందాయి.
• బ్యాంకు లింకేజీని విస్తరించడం, స్వయం ఉపాధి సంఘాలు మరియు ఇతర సీబీవోలకు రివాల్వింగ్ ఫండ్ సపోర్టులో భాగంగా ఎంఎస్ఎంఈల ప్రమోషన్ చేపట్టబడుతోంది.
• పీఎంఎఫ్‌ఎంఈ కింద 1200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆమోదం తెలపడమైంది.
• జీవనోపాధిని ప్రోత్సాహించానే లక్ష్యంతో “అమృత్ మిత్ర” కింద ఎస్‌హెచ్‌జీ మహిళలకు 85 ప్రాజెక్టులు అందించడం జరిగింది.
• 6.8.2024న జరిగిన గత కలెక్టర్ల సమావేశం నుండి ఇప్పటివరకు 61,427 పీఎం స్వానిధి రుణాలు పంపిణీ చేయబడ్డాయి.
• పీపీపీ ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు.
• ఏపీయూఐఏఎంఎల్ మార్గదర్శకత్వంతో 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 92 ప్రాజెక్టులు గుర్తించచబడ్డాయి.
• రాష్ట్రంలో వాటర్ సప్లై కింద కవరేజీ ఆఫ్ ఎఫ్‌హెచ్‌టీసీ (64.23%), సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద గార్బేజ్ కలెక్షన్ (86.5%), వేస్ట్ ప్రాసెసింగ్ (49%), లెగసీ వేస్ట్ (54%),లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద (28.38%), స్టార్మ్ వాటర్ బేసిన్ కింద (42.69%), రోడ్స్ (80.1%), స్ట్రీట్ లైటింగ్ (93.1%), మెప్మా కింద ఎంఎస్ఎంఈ (35.3%) కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
• 2025 ఆగష్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా శునకాలకు స్టెరిలైజేషన్(సంతాన నిరోధ శస్త్ర చికిత్స) వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
• రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నాక్యాంటీన్లు మంజూరు కాగా కొత్తగా 63 క్యాంటీన్లకు ప్రతిపాదనలు వచ్చాయి. వాటి అంచనా వ్యయం రూ.37.21 కోట్లు.
• 23,379 రోడ్ల మరమ్మతు పనులు చేపట్టగా 12,563 పనులు పూర్తయ్యాయి.. మరమ్మతు పనులు పూర్తయినది 53.5% కాగా, 10,816 పనులు పురోగతిలో ఉన్నాయి.
• ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్స్.. 172 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక లేఅవుట్..
• ఏపీ సీఆర్డీఏ ఆర్5 జోన్ కింద మొత్తం మంది లబ్ధిదారుల సంఖ్య 50,793.

పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్

• రాష్ట్రంలో ప్రతి నెలా సుమారు 64 లక్షల సామాజిక ఫించన్లు పంపిణీ చేయడం జరుగుతోంది.
• స్వయంగా సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఒక గ్రామంలోని ఫించన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారు.
• అనర్హులు ఫించన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో 26 జిల్లాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామ, ఒక వార్డు సచివాలయంలో ఈ నెల 9,10 తేదీల్లో ఒక పైలెట్ సర్వే నిర్వహించారు.
• సర్వేలో మొత్తం 10,958 ఫించన్లు తనిఖీ చేయగా వాటిలో 10,020 ఫించన్లు సక్రమంగా ఉండగా 563 అనర్హంగా ఉన్నట్టు గుర్తించాం.
• అనర్హత గల ఫించన్లలో అధికంగా దివ్యాంగ ఫించన్లు ఉన్నట్టు తేలింది.
స్వయం సహాయక సంఘాలు
• స్వయం సహాయక సంఘాలను పొదుపు నుండి ఆదాయార్జన సంఘాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
• రూ. కోటి వరకు పొదుపు చేసిన వారిని మైక్రో ఎంటర్ ప్రైజ్ లుగా.. రూ. కోటి నుండి రూ. 10 కోట్ల వరకు పొదుపు చేసిన సంఘాలను మైక్రో నుండి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ లుగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
• ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది 21.5 కోట్ల పని దినాలు కల్పించాలని లేబర్ బడ్జెట్ రూపొందించినట్టు తెలిపారు.
• ఈ ఏడాది ఇప్పటికే రూ. 6, 804 కోట్ల పనులు జరిగాయి. 2 లక్షల 3వేల మందికి 100 రోజుల పనిని పూర్తి చేశారు.
• ఈ రోజు 3 లక్షల మంది ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యారు.
• ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాం.
పల్లె పండుగ
• ఈ కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో సిసి, బిటి, డబ్ల్యుబిఎం రహదారుల నిర్మాణానికి, పశువుల షెడ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టాం.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ బుధవారం కేంద్రం ప్రభుత్వం నుండి 4 జాతీయ అవార్డులను పొందడం జరిగింది.
• రాష్ట్రంలో 80వేల కి.మీ. పంచాయితీ రాజ్ రహదార్లు, గ్రామాల్లో 68 వేల కి.మీ.ల ఇంటర్నల్ సి.సి. రోడ్లు ఉన్నాయి.
• ఈ ఏడాది 3వేల కి.మీ.ల సి.సి. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాం.
• రానున్న నాలుగేళ్లలో 14వేల కి.మీ.ల సి.సి. రోడ్ల నిర్మాణం చేపట్టనున్నాం.
• జల్ జీవన్ మిషన్ కింద 10,496 పనులను నిర్వహిస్తున్నాం.

కె.విజయానంద్ – రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీఎం సూర్య ఘర్ యోజన

• నేషనల్ పోర్టల్ ద్వారా ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
• వీరిలో 77.09 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 6.5 వేల ఇన్‌స్టలేషన్లు పూర్తయ్యాయి. మొత్తం లోడ్ 24, 339 కిలోవాట్స్
• ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలో వాట్ కు రూ.30 వేలు, రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తుంది.
• జిల్లా కలెక్టర్లు ఈ పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు మరియు ఇన్‌స్టలేషన్లు పెరిగేలా చూడాలి.
• ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ కింద రూ.10.88 కోట్లు, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్ కింద రూ.7.74 కోట్లు, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేయడం జరిగింది.
• రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టలేషన్‌లను చేపట్టాలని యోచిస్తోంది.
• రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ కింద 6,77,146 మంది, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్ కింద 5,9,587 మంది, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు.. వీరితో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది.
• ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలి.
పీఎం కుసుమ్
• ఇందులో 3 స్కీమ్స్ ఉన్నాయి.. మనం కాంపోనెంట్-సీ కింద మొత్తం 3,725 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవసాయ ఫీడర్లను సోలారైజ్ చేయడానికి ప్రతిపాదించడం జరిగింది.
• 0.5 నుండి 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన కోసం ఒక మెగావాట్ కు సంబంధించి ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాలను గుర్తించాలి.

డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కమిటీలు – ఆర్డీ.ఎస్.ఎస్

• రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా విద్యుత్ కమిటీలను నోటిఫై చేసింది..
• జిల్లాల్లో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధిని సమీక్షించడానికి, సమన్వయం చేయడానికి కమిటీలు కనీసం మూడు నెలలకు ఒకసారి జిల్లా కేంద్ర కార్యాలయంలో కాలానుగుణంగా సమావేశమవ్వాలి.
• జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి సకాలంలో మినిట్స్ జారీ చేయాలి.

బయో గ్యాస్ (సీ.బీ.జీ) ప్లాంట్స్ – ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024

• రిలయన్స్ సంస్థ పెట్టుబడులకు ముందుకు వచ్చింది..
ప మూలధన సబ్సిడీ.. సీబీజీ ప్లాంట్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌సీఐ)పై 20% కేపిటల్ సబ్సిడీ గరిష్టానికి లోబడి ఉంటుంది.
• విద్యుత్ డ్యూటీ : సీఓడీ నుండి 5 సంవత్సరాల కాలానికి సీబీజీ ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్ కు 100% విద్యుత్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్.
• ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం సీబీజీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు లీజు చొప్పున వ్యర్థ భూములను కేటాయించాలి.
• కలెక్టర్లు మా దగ్గర ఈ భూములున్నాయని ముందుకు వస్తే చాలా సంతోషం..
సోలార్ పార్క్స్
• 5,853 ఎకాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పార్క్, 2,801 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో గాలివీడు సోలార్ పార్క్, 5,570 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్, 2,873 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం-II అల్ట్రా మెగా సోలార్ పార్క్ (తలారిచెరువు), 5,944 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ ఏర్పాటు..

న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ (RE) ప్రాజెక్ట్స్

• 1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా దొనకొండలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో, 500 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా ఎన్.పి.కుంటలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో సోలార్ పార్కుల ఏర్పాటు.
• ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ఇప్పటికే ఉన్న హైవే కనెక్టివిటీతో పాటు రామాయపట్నం పోర్ట్‌కి సులభంగా యాక్సెస్ జరిగేలా తగిన భూమిని గుర్తించాలి..

ముఖ్యమంత్రి స్పందిస్తూ

• రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దాలి. అవసరమైతే గ్రీన్ కారిడార్స్ తయారు చేయాలి.
• సోలార్ విండ్ పంప్డ్ బ్యాటరీ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే థర్మల్, హైడల్, గ్యాస్ ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ చాలా ముఖ్యం.
• ఎనర్జీ, ఫ్యూయల్ రేట్స్ తగ్గాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.
• కొత్త పాలసీ ప్రకారం ఛార్జింగ్ స్టేషన్లు పెట్టబోతున్నాం. పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది.
• మనకు పోర్టులు పెద్ద అడ్వాంటేజ్. సూర్య ఘర్ కింద ప్రతి ఇంటి మీద కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. ఈ పథకంలో సబ్సిడీ కూడా వస్తోంది. వాడుకోగా మిగిలిన కరెంట్ విక్రయించుకోవచ్చు.
• ఇప్పటికే కుప్పంలో ఒక మోడల్ ఆలోచించమని చెప్పాం.
• గవర్నమెంట్ బిల్డింగ్స్, స్పేస్ ఉన్న స్కూల్స్ లో ఈ విధానం అమలు చేయొచ్చు.
• గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనేది మన ఆలోచన.
• రైతులను ప్రోత్సహిస్తాం.
• ఎనర్జీలో రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004లో నా పవర్ పోగొట్టుకున్నాను.
• ఇప్పుడు ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం.
• ఎనర్జీని అందరూ సీరియస్ గా తీసుకోవాలి.
• ఒక యూనిట్ ను సేవ్ చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేయొచ్చు.
• విద్యుత్ ప్రమాదాలను అరికట్టాలి, సేఫ్టీ చాలా ముఖ్యం.
• ఇకపై ప్రమాదాలు జరగకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి

ఆరు నెలల ఎన్డీఏ పాలనలో పారిశ్రామికాభివృద్ధి

• ఐదేళ్ల జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో కుదేలైన కీలక రంగం పారిశ్రామిక రంగం. రాష్ట్రానికి వచ్చిన కంపెనీల కంటే తరలిన, మూసేసిన కంపెనీలే ఎక్కువ.
• 2024 జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేశారో ఆ రోజు నుంచి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తు క్యూ కట్టారు.
• వచ్చే ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ఎన్డీఏ పరుగులు తీస్తోంది.
• వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు జంకిన పారిశ్రామికవేత్తలు సైతం నేడు రాష్ట్రానికి క్యూ కట్టారు.
• జువ్వలదిన్నెలో రూ.2 వేల కోట్లతో HPCL, రామయపట్నంలో రూ.43 కోట్లతో ఇండోసోల్, రూ.60 వేల కోట్లతో HPCL, విశాఖలో టీసీఎస్ ఇలా ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించాయి.
• రూ.61,780 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అర్సెలర్ మిట్టల్, రూ.1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ,
• రాష్ట్రంలో రూ.172 కోట్లతో 3 చోట్ల మాల్స్ మొదలుపెట్టడానికి Lulu Group సిద్దమైంది. విశాఖలో యూనిటీ మాల్‌ను, రూ.2800 కోట్లతో గోద్రెజ్, బ్రూక్ ఫీల్డ్, 15 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా HCL రెండో దశ విస్తరణ, మెగా సిటీ ఏర్పాటుకు ఫాక్స్ కాన్, రూ.4 వేల కోట్లతో విన్ ఫాస్ట్, జైరాజ్ ఇస్పాత్ రెండో దశ విస్తరణ చేయనున్నాయి.
• యూనివర్సిటీ ఏర్పాటుకు అపోలో, యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చాయి. దాంతో పాటు విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి గూగుల్, రూ.65 వేల కోట్లతో బయో గ్యాస్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
• ఇలా చెప్పుకుంటూపోతే ఆరు నెలల్లో 50 పైగా కంపెనీలు, సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఎన్డీఏ ప్రభుత్వం ఆకర్షించింది

పర్యాటక శాఖ సమీక్ష ముఖ్యాంశాలు

• ఆంధ్రా టూరిజం పాలసీపై కేంద్రం ప్రశంసలు
• ఏపీ టూరిజం పాలసీని దేశంలో అత్యుత్తమైనదిగా గుర్తించిన కేంద్రం
• పెద్ద గ్రూపుల పెట్టుబడులకు మార్గం సుగమం
• ఒబెరాయ్, తాజ్, మహింద్రా ,మేఫైర్, వంటి సంస్థల పెట్టుబడులు ఆకర్షణ
• సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ప్రకారం 5 స్టార్ హోటళ్లకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాలి.
ఈవెంట్స్ క్యాలెండర్ మరియు బ్రాండింగ్
• ఈవెంట్స్ క్యాలెండర్ సిద్ధం, బ్రాండింగ్ కోసం ఏజెన్సీ నియామకం పూర్తయింది.
• సంప్రదాయాలు, కళలు, పండుగలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఏడాది పొడవునా ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడంపై దృష్టి.
7 పర్యాటక అభివృద్ధి గమ్యస్థానాలు
• విశాఖపట్నం, అరకు-లంబసింగి, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి.
• పాలసీలో 25 థీమ్ ఆధారిత పర్యాటక మార్గాలు చేర్చారు.
• 2025 ఫిబ్రవరి నాటికి డీపీఆర్లు సిద్ధం.
ప్రాజెక్టులు & ఫండింగ్
• సాస్కి స్కీం క్రింద రూ. 172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి పనులు.
• స్వదేశ్ దర్శన్ 2.0, సాస్కి స్కీం క్రింద రూ. 250 కోట్ల పెట్టుబడులు.
• శ్రీశైలం, అమరావతి, బీచ్ కారిడార్లు అభివృద్ధి.
• అరకు-లంబసింగి, కోనసీమ, పాపికొండలు అభివృద్ధి పనులు ప్రారంభం.
• భారీ ఎత్తున పెట్టుబడులు & ఉద్యోగాలు
• రూ. 6,500 కోట్ల పెట్టుబడులతో హోటల్స్, రిసార్టుల ఏర్పాటు
• 25,000కు పైగా ఉద్యోగాల సృష్టి లక్ష్యం
ప్రముఖ సంస్థల పెట్టుబడులు:
క్లబ్ మహింద్రా – ₹1000 కోట్లు
ఒబెరాయ్ – ₹2100 కోట్లు
తాజ్ – ₹428 కోట్లు
రాడిసన్ – ₹1250 కోట్లు
అట్మోస్ఫియర్ – ₹1200 కోట్లు
ఫోర్ సీజన్స్ – ₹200 కోట్లు.
ముఖ్యమంత్రి సూచనలు:
• టూరిజాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు నిర్ధిష్ట ప్రణాళికలతో పనిచేయాలని కలెక్టర్లకు సూచన.
• “మన రాష్ట్రంలో ఉన్నన్ని ప్రదేశాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. అవి ప్రాచుర్యం పొందేలా ప్రోత్సహించాలి.”
• “లా & ఆర్డర్ కూడా పర్యాటకానికి కీలకం. భద్రత లేని చోటికి పర్యాటకులు రారు.”
• వచ్చే 6 నెలల్లో కార్యాచరణ మొదలుపెట్టాలని
మొత్తం లక్ష్యం
• ప్రపంచస్థాయి హోటల్స్ రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షించాలి.
• మన వంటకాలకు ప్రోత్సాహం అందించాలి. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
• దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించుకుని విస్తృత ప్రచారం కల్పించాలి.

Exit mobile version