ఏపీలో ‘వాట్సప్ పరిపాలన’
(అమరావతి, 29/1/2025,pvginox.com )

వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
తొలిదశలో ప్రజలకు అందుబాటులోకి 161 సేవలు
వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం మెటాతో ఒప్పందం
దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ .
తొలివిడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ , రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్‍ఎఫ్, మున్సిపాల్ శాఖల సేవలు.
వేగంగా పౌరసేవలు, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ .
ఏపీ ప్రభుత్వం 161 సేవలు అందిస్తుంది .
రెండో విడతలో వాట్సాప్‍లో 360 సేవలను అందుబాటులో ఉంచుతాం .
రెండో విడత వాట్సాప్ గవర్నెన్స్ కు ఏఐను కూడా జోడిస్తాం.
9552300009 వాట్సాప్ నెంబర్
వాట్సాప్ అందరూ వాడే ఫోన్ అప్లికేషన్ .
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూశా .
గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి.
వాట్సాప్ గవర్నెన్స్ తో సులభంగా సమస్యలు పరిష్కారం.
యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన
ప్రపంలో ఎక్కడా ఇలాంటి సేవలు తీసుకురాలేదు.
ఎంవోయూ చేసుకున్న 3 నెలల 9 రోజుల్లోనే దీనిని ప్రారంభిస్తున్నాం
మాది ప్రజా ప్రభుత్వం .
ప్రజల చేతుల్లో పాలన ఉండాలన్నదే మా ఉద్దేశం .
భవిష్యత్‍లో మరిన్ని ప్రభుత్వ సేవలకు విస్తరణ .
యువగళం పాదయాత్రలో అన్ని వర్గాలను కలిశా.
ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది .
వాట్సాప్ గవర్నెన్స్ తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదు.
: మంత్రి నారా లోకేశ్