ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆద్వర్యంలో కమల దళపతి కి సన్మానం
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెమ్మా మల్లికార్జున చే సన్మానం

(తిరుపతి, 29/1/2025,pvginox.com)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బుదవారం తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారికి అభినందన సభ ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కమల దళపతి కాపుల ఆత్మ బంధువు పేదల పాలిట పెన్నిధి సామంచి శ్రీనివాస్ గారికి సీనియర్ పాత్రికేయులు నేషనల్ ఆక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెమ్మా మల్లికార్జున ఆద్వర్యంలో కాపునాడు సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెమ్మా మల్లికార్జున మాట్లాడుతూ సామంచి శ్రీనివాస్ బిజెపి లో సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గా అధిష్టానం గుర్తించి తెచ్చుకొన్నారు. తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజల కోసం ప్రగతి కోసం పనిచేసిన చేస్తున్న ఏకైక నాయకుడు ప్రజాదరణ పొందిన యువనేత శ్రీ సామంచి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శభాకాంక్షలు తెలుపుతూ వారికి శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెమ్మా మల్లికార్జున తెలిపారు.
నా మీద మీరు చూపిన ప్రేమాభిమానం నా ఊపిరి ఉన్నంతవరకు మరువలేను
ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సా శ్రీనివాస్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది సామంచి శ్రీనివాస్ గత 30 సంవత్సరాలుగా విద్యార్థి దశనుండి అనేక పోరాటాలు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి బిజెపి లో అనేక పదవులు అధిరోహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న ప్రజాదరణ పొందిన నాయకుడు మన తిరుపతి జిల్లా కమల దళపతి శ్రీ సామంచి శ్రీనివాస్ గారు. బుదవారం తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు గా పదవీ బాధ్యతలు చేపట్టడం మరియు అభినందన సభ కు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువత ప్రజలందరూ తరలి వచ్చిన శుభ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నామీద అభిమానంతో పిలువకపోయినా తరలి వచ్చి అభినందనలు తెలిపారు. మంత్రి సత్యకుమార్ గారికి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు పులిపర్తి గారికి బానుప్రకాశ్రెడ్డి గారికి కోలా ఆనంద్ గారికి చల్లపల్లి నరసింహారెడ్డి గారికి ఉకా విజయకుమార్ కు హరిప్రసాద్ కు బిజెపి నాయకులు మాజీ మంత్రి నాయకులు ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలకు తావులేకుండా అందరూ కలిసి రావడం నా అదృష్టం అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతి జిల్లా కమల దళపతి సామంచి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కన్వీనర్ చింతం శెట్టి మల్లికార్జున , జిల్లా అధికార ప్రతినిధి తుపాకులు మురళి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, ఏ. రమేష్ తదితరులు ఉన్నారు