గుచ్చుకున్న గాజు…
(అమరావతి, 24జనవరి, 2025 pvginox)
పవన్ కళ్యాణ్ అన్నా, గాజు గుర్తన్నా, ఇష్టమొచ్చినట్లు నోరు పడేసుకున్న వాళ్ళందరికి గాజు పెంకు గుచ్చుకుంది. అయితే అది ఎక్కడ గుచ్చుకుందో చెప్పడానికి ఎవరి నోర్లు పెగళడం లేదు. అబ్బబ్బా.. అనుకోవడం తప్ప కనీసం పక్కనోడికి కూడా చెప్పుకోలేని పరిస్థితి.గ్లాస్ గుర్తుకి జాతీయ ఎన్నికల గుర్తింపు రావడం ఇందుకు ఉదాహరణ.
ప్రశ్నించడంతో మొదలైన పవన్ కళ్యాణ్ ప్రజాజీవన క్షేత్ర యాత్ర నేడు అనేక ప్రశ్నలుగా మిగిలిపోయింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. సీన్ కట్‌చేస్తే ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ నాయకుడిగా ఎదిగాడు. కూటమి సక్రమంగా పనిచేయడానికి తనవంతు ప్రయత్నాలు ప్రజలందరికి తెలిసివస్తున్నాయి. ఎక్కడా నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అంటూ తగ్గాల్సిన చోట తగ్గుతూ ‘‘సీజ్‌దషిప్’’ అనే వైఖరి కొంత మంది నాయకులకు ససేమిరా నచ్చడం లేదు. అయినా ప్రజల కోసం, రాష్ట్రాబివృద్ధి కోసం తాను తీసుకునే నిర్ణయాలు మాత్రం అందరిని అబ్బుర పరుస్తున్నాయి.
ఆవేశంగా ఊగిపోయిన రోజులు చూశాం. ఆలోచనతో కార్యాచరణ చేసిన సందర్భాలనూ చూశాం. కూటమి ఏర్పడినాటి నుంచి ఐక్యతకు దెబ్బకొట్టేవాళ్ల ప్రయత్నాలను ఒక మిసైల్‌లా ఎదుర్కోవడం పవన్‌కళ్యాణ్‌కే సాధ్యమైంది. అనుభవజ్ఞుడు అలసి పోయాడని యువనాయకుడు అన్న సందర్భం…. ఇప్పుడు మంత్రి లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే కొందరి రాజకీయ నాయకుల ఎత్తుగడకు చివరికి పెద్దాయనే దాని ప్రస్తావన తేవద్దంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడంటే పవన్ పవర్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.. పవన్ కళ్యాణ్ తాను సింగిల్ స్టేట్‌మెంట్ ఇవ్వకుండా కూటమిలో చిచ్చులు పెట్టే వాళ్ళ నోళ్ళు మూయించడం గమనార్హం.
పంచాయతీ రాజ్ పాలనను గాడిలోపెట్టి గ్రామాల్లో వసంతాలు తెచ్చిన డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తాజాగా అటవీ శాఖపై దృష్టి సారించడం గమనార్హం. అటవీ సంపదను కాపాడాలని కోరుకునేవారికి ఆనందాన్ని కలిగిస్తుంటే అటవీ సంపదను కొల్లగొట్టే స్మగ్లర్లు గుండెల్లో ఎర్రచందనం దుంగలు దూరి పోతున్నాయి. ప్రజా స్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా పవన్ ఎదగడమే పవనిజం అని యువకులే కాదు రాజకీయ ఉద్దండులు సైతం చర్చించుకుంటున్నారు. లెట్స్ వెయిట్ …వాట్ విల్ హ్యాపెన్డ్