Uncategorized

చిన్నాన్నను చంపిన చరిత్ర విజయసాయి రెడ్డిది.. సోమిరెడ్డి ఫైర్

Spread the love

(నెల్లూరు, 25/1/2025,pvginox)

విజయసాయిరెడ్డిపై మరోసారి టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సొంత చిన్నాయనను చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయి రెడ్డి కుటుంబానిది

రాజీనామా పేరుతో రాత్రి నుంచి విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తున్నాం

కాంగ్రెస్, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షకట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి

నా కుమారుడికి, మాకు సూట్ కేస్ కంపెనీలు, అక్రమ ఆస్తులన్నాయని, మనీ లాండరింగ్ చేశామని ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి ఈడీ, ఆర్వోసీ, ఐటీలకు ఫిర్యాదు చేశాడు

విజయసాయి రెడ్డి ఒత్తిడితో సాగిన విచారణలతో నా కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండేళ్ల పాటు నలిగిపోయాడు

సమగ్ర విచారణ జరిపిన ఆయా సంస్థలు, అధికారులు మా ఆర్థిక పరిస్థితి చూసి సానుభూతి చూపించి కేసులు క్లోజ్ చేశారు

మాది అల్లీపురం అయితే కొంచెం దూరంలోనే విజయసాయిరెడ్డి ఊరు తాళ్లపూడి ఉంటుంది

తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్న కుటుంబం మాది.

మా భూములను స్కూళ్లు, ఆస్పత్రులు, పేదల ఇళ్ల కోసం ఉచితంగా ఇచ్చాం..ఈ రోజు వాటి విలువ కోట్లాది రూపాయలు

విజయసాయి రెడ్డి చరిత్ర ఏంటో తెలుసా….అయన తండ్రి, పినతండ్రి కలిసి..వాళ్ల చిన్నాయన్ని హత్యచేసి జైలుపాలయ్యారు

మా పెదనాయన ఆదినారాయణ రెడ్డి స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళితే, విజయసాయిరెడ్డి నాయన, చిన్నాయన మర్డర్ కేసులో ఊచలు లెక్కపెట్టి వచ్చారు

ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి గురించి విజయసాయిరెడ్డి గతంలో చాలా దుర్మార్గమైన భాష ప్రయోగించారు

ఆ దుర్మార్గంపై ప్రశ్నించిన నాకు రూ.5 కోట్లకు పరువు నష్టం దావా నోటీసు పంపాడు

ఏం చేసుకుంటావో చేసుకో..అని నోటీసును చెత్తబుట్టలో పడేశాను

మెతకవారితో ముందుకు సాగే చాలా మంచివారైన ఉత్తరాంధ్ర ప్రజలపైనా పెత్తనం చేసి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు

తాళ్లపూడికి చెందిన విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రతో ఏం సంబంధం…నెల్లూరుకే చెందిన ఆయన వియ్యంకుండి పెత్తనం ఉత్తరాంధ్రలో ఏంటి

ఇద్దరూ కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల కోట్లు దోచుకున్నారు

క్రూరమృగం కూడా ప్రవర్తించని విధంగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు.

ఏ కారణం లేకుండా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారు.

2029 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ప్రాణాలతో ఉండకూడదని కోరుకున్న దుర్మార్గమైన వ్యక్తి విజయసాయిరెడ్డి

ముసలి నక్కగా మారిన విజయసాయి రెడ్డి ఏ పార్టీలో అయినా చేరు..ఎవరి కాళ్లు అయినా పట్టుకోవచ్చు

విజయసాయి రెడ్డితో పాటు ఆయన వియ్యంకుడి కుటుంబం చేసిన పాపాలను ఎన్ని జన్మలెత్తినా దేవుడు క్షమించరు…ఫలితం అనుభవించి తీరాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *