పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయింది.
వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టిన పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరచడానికి తండ్రి కొడుకులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు.
- షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.
నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు.
అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపునే దావోస్లో నాయకత్వం వహించారు.
ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఎముకులను కొరికే చలిని (-6°) సైతం లెక్కచేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి దావోస్ నడి వీధుల్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పడిన శ్రమ సత్ఫలితాలనిస్తున్నాయి
వెళ్ళిన ప్రతి చోట రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు గారు, లోకేష్ గారికి పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సీఎం చంద్రబాబు గారి విజన్ ను మెచ్చుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తోంది
దావోస్లో పర్యటించిన నాలుగు రోజుల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసినంత మంది పారిశ్రామికవేత్తలను జగన్ రెడ్డి జీవితంలో కలిసి ఉండరు
ఐదేళ్లల్లో జగన్ రెడ్డి తీసుకురాలేనన్ని పెట్టుబడులు ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే మనం సాధించాం.
కమిషన్ల కోసం కకృత్తిపడి చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, స్టార్టప్ కంపెనీలను, లక్షల కోట్ల పెట్టుబడులను జగన్ రెడ్డి తరిమేశాడు.
జే ట్యాక్స్తో పారిశ్రామికవేత్తలను బెంబేలెత్తించి పారిశ్రామికాభివృద్ధిని గాలికి వదిలేశాడు.
2019లో వైసీపీ వచ్చాక ‘బ్రాండ్ ఏపీ’గా ఉన్న మన రాష్ట్రాన్ని ‘బిల్డప్ ఏపీ’గా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారు.
ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులుతో సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.
ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి, యువతకు 40 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.
ఒక్క జూమ్ కాల్ తోనే ఆర్సెలార్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. జనవరి 8న విశాఖలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోది శంకుస్థాపన చేశారు.
టీసీఎస్, బీపీసీఎల్, రిలైన్స్, గ్రీన్ కో, ఆర్సెలార్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి.