Uncategorized

డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీవిరమణ… నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా….

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపిఎస్ గారు పదవి విరమణ…

నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ

(అమరావతి, 31/1/2025, pvginox.com)

*మంగళగిరిలోని ఏపీఎస్పీ 6th బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ గారు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫేర్ వెల్ పరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు.

ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ గారు మాట్లాడుతూ తన చిన్ననాటి విషయాలని జ్ఞాపకం చేసుకున్నారు

తన ట్రైనింగ్ లో తనకి ప్రోత్సాహాన్ని ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజును మర్చిపోలేను అన్నారు నాకు ప్రతి విషయంలో నా వెంట ఉండి నన్ను ప్రోత్సహించిన నా భార్యకు కృతజ్ఞతలు

నాతో పాటు పని చేసిన సిబ్బందికి అందరికీ హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేశారు

35 సంవత్సరాలు యూనిఫామ్ వేసుకొని ఈరోజు వదిలిపెట్టడం చాలా బాధగా ఉందని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు

*ఈ కార్యక్రమంలో నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఐ జి పి రాజకుమారి, పలువురు ఎస్పీలు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు .


అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుచుకుంటూ విజన్ 2047 కోసం పోలీస్ శాఖ సహకరిస్తుంది అని అన్నారు.
CCTV కెమెరాలను పెంచి, నేరపూరిత ప్రదేశాల్లో నేరస్తులను గుర్తించి శిక్షపడేలా చర్యలు తీసుకోనున్నారు. AI సాయంతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. Narcotics విభాగాన్ని బలోపేతం చేస్తాం అని అన్నారు .
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ సెక్యూరిటీ బలోపేతం చేసి, సైబర్ నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి పెడతాం అని అన్నారు. Cyber Commandos కోసం 600 మంది అవసరం, వారికి IITలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తాం అని అన్నారు. ప్రతీ జిల్లాకు ఒక సైబర్ సెక్యురిటి పోలిస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తాం అని అన్నారు. సోషల్ మీడియా కేసులు & సైబర్ క్రైమ్ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీస్ వెల్ఫేర్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.పోలిస్ శాఖ లో ప్రమోషన్స్ వేగంగా వచ్చే విదం గా కృషి అని చెప్పారు . పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, వారికి మెరుగైన ఆరోగ్య సేవలు మీద దృష్టి పెడతాం అని చెప్పారు.
పోలీస్ అకాడమీ & గ్రేహౌండ్స్ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినందున, పనులు త్వరగా పూర్తి చేస్తాం అని అన్నారు. గ్రేహౌండ్స్ బలోపేతం చేస్తాం అని అన్నారు. Dial 100 సేవలు ఇప్పటికే బాగా పని చేస్తున్నప్పటికీ, మరింత సమర్థవంతంగా మార్చనున్నట్లు తెలిపారు.
CCTNS ఇప్పటికే బాగుంది కానీ, మరింత సమర్థవంతంగా నేర విచారణ వేగవంతం చేయడానికి అభివృద్ధి చేస్తామని డిజిపి చెప్పారు.
డిజిపి హరీష్ కుమార్ గుప్తా “కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్” పై దృష్టి పెట్టాలని ప్రకటించడం పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే కీలక నిర్ణయంగా చెప్పారు.
ఈ ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలైతే, రాష్ట్రంలో నేరాల నియంత్రణ, పోలీస్ శాఖ ప్రగతి, మరియు ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడానికి వీలు పడుతుంది అని డిజిపి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *