దేశం గర్వించేలా మహిళా సాధికారత సదస్సు.. కలెక్టర్ వెంకటేశ్వర్

Spread the love

 తిరుపతి జిల్లాలో ప్రప్రథమంగా జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ నిర్వహించబడడం ఒక చారిత్రాత్మక ఘట్టం.

 మన రాష్ట్రంలో తిరుపతి జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను దేశం గర్వించదగ్గేలా సమన్వయంతో విధులు నిర్వహిద్దాం.

 తిరుపతి జిల్లాలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు సంబంధించి లైజాన్ అధికారులకు శిక్షణా తరగతుల నిర్వహణ.

: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్.

( తిరుపతి, సెప్టెంబర్ 09:pvginox.com by PALLA VENUGOPAL )

ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను   ప్ర ప్రధమంగా మన రాష్ట్రం, మన తిరుపతి జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు గర్వించదగ్గేలా కలిసికట్టుగా నిర్వహిద్దామని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరం నందు  కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  


 మంగళవారం ఉదయం స్థానిక కల్లెక్టరేట్ లోని సమావేశ మందిరం లో ఈ నెల 14,15 వ తేదీలలో తిరుపతి జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫెరెన్స్ ను దిగ్విజయంగా నిర్వహించుటకు లైజన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించుట పై దిశా నిర్దేశం చేసారు.  

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ మన రాష్ట్రం, మన జిల్లా నందు మొట్ట మొదటి సారిగా జరుగుతుందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చు ప్రముఖులకు ఎలాంటి లోటుబాట్లు లేకుండా, అవాంతరాలు ఏర్పడకుండా మౌలిక వసతులను కల్పించాలని దానికి తగ్గట్లుగా లైజాన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు 4 రోజుల పాటు విధులు కేటాయించిన ప్రతి అధికారి సమన్వయంతో లోటుపాట్లు లేకుండా వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని తెలిపారు. అలాగే మన జిల్లా గురించి అందరు గొప్పగా చెప్పుకునే విధంగా వచ్చు ప్రముఖులతో సానుకూలంగా, గౌరవ ప్రధమైన భావంతో వ్యవహరించాలని వారి మన్ననలు పొందాలని తెలిపారు. ప్రముఖులకు ఏర్పాటు చేసిన వసతి గ్రుహాలందు హెల్ప్ డెస్క్ లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారికి వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులకు విధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు వస్తున్నారని ఈ జాతీయ మహిళా  సాధికారిత కాన్ఫెరెన్స్ కు  శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. 

కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశ్యం – మహిళల సాధికారిత, నాయకత్వం, ఉపాధి అవకాశాలు, సామాజిక – రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యం పై చర్చలు జరిపి, విధాన పరమైన సూచనలను తేల్చడం. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల విజయవంతమైన మహిళా సాధికారిత మోడల్స్ ను ప్రదర్శించనున్నారు. తిరుపతిలో ఈ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరగడం మన రాష్ట్రానికి, జిల్లాకు ఎంతో గర్వించ దగ్గ విషయమన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరి మన్ననలు పొంది వచ్చిన ప్రముఖులు తిరుపతిలో జరిగిన కార్యక్రమం విజయంతంగా నిర్వహించారని, తెలిసేలా అందరు అధికారులు సమన్వయంతో వారి విధులను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో లైజన్ అధికారులకి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్ర మౌళి శిక్షణా తరగతులు నిర్వహించి వారికి వచ్చు ప్రముఖులతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ కార్యాలయపు సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారి రామ్ మోహన్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.