చీరాల 1టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు.
చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ వ్యవస్థను ప్రారంభించిన డిజిపి గారు.
కారంచేడు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరకు నిర్మించిన వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన డిజిపి గారు.
వేద మంత్రోచ్చారణ నడుమ పోలీస్ గార్డు హానర్ తో డిజిపి గారికి ఘనస్వాగతం పలికిన జిల్లా పోలీసు అధికారులు.
డిజిపి గారి వెంట ఉండి కార్యక్రమాల విశేషాలు తెలిపిన గుంటూరు రేంజి ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి ఐపిఎస్ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ గారు.
210 కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరా, 50 మేన్ ప్యాక్ లు, ఒక రిపీటర్ వ్యవస్థ, LCD మానిటర్లతో కామెంట్ కంట్రోల్ ఏర్పాటు
నేరాలు, రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటమే కమాండ్ కంట్రోల్ లక్ష్యం.
మార్చి నెలలోపు లక్ష కెమెరాలు అమర్చాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నాం.
దాతలు సైతం ముందుకొచ్చి వారి వారి ప్రాంతాల్లో కెమెరాలు అమర్చుకోవాలి.
నేరం జరిగిన తరువాత దాన్ని ఛేదించడమే కాకుండా ముందస్తుగా నేరం చేయాలంటే భయం ఏర్పడేందుకే ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ.
డిజిపి శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు
.(బాపట్ల, 24,జనవరి, 2025,pvginox )
నేరాలు చేయాలనే ఉద్దేశం నేరస్తులకు రాకూడదనేది ప్రథమ లక్ష్యమని.., రాష్ట్రవ్యాప్తంగా లక్ష కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నామని.., రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు తెలిపారు. జనవరి 24న శుక్రవారం బాపట్ల జిల్లాలోని చీరాల 1టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసినారు. చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను, కారంచేడు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరకు నిర్మించిన వెయిటింగ్ హాల్ లను డీజీపీ గారు ప్రారంభించినారు.
ఈ సందర్భంగా డిజిపి గారు మీడియాతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ భవిష్యత్తులో నేరాలు జరగటానికి, ఏవైనా అవాంఛనీయ ఘటన జరగడానికి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి అత్యాధునిక పరిజ్ఞానంతో Two Way కమ్యూనికేషన్ విధానంతో చీరాల పట్టణంలో 150 సీసీ కెమెరాలను అదేవిధంగా సముద్ర తీర ప్రాంతమైన ఓడరేవు నుండి పొట్టి సుబ్బయ్య పాలెం వరకు 30, సముద్రానికి ప్రధాన రాకపోకల మార్గాలలో 30 సీసీ కెమెరాలను మొత్తం 210 సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాలన్నీటిని అనుసంధానం చేసి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పరిశీలించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 25 మ్యానుఫ్యాక్ లు, ఒక డ్రోన్, ఎల్ఈడి మానిటర్ లు, రిపీటర్ వ్యవస్థ, ప్రతి కెమెరా వద్ద కూడా పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం పెట్టడం ద్వారా ఈ వ్యవస్థలన్నిటిని ఒక తాటి మీదకు తీసుకువచ్చి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా కమాండ్ కంట్రోల్ భవనం నుండి నేరుగా ఆదేశాలు జారీచెయ్యవచ్చునని సమీపంలో ఉన్న ప్రజలు కూడా ఈ పీఏ సిస్టం ద్వారా ఆదేశాలు అందుకొని జాగ్రత్త పడవచ్చునని తెలిపారు. ఈ వ్యవస్థ వలన నేర నియంత్రణ చేయవచ్చని నేర పరిశోధనలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో యాత్రికులకు మరింత రక్షణ ఇవ్వవచ్చునని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కెమెరాలను అమర్చాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నామన్నారు. ఇటీవల 1150 కెమెరాలను విజయవాడ పట్టణంలో అమర్చడం జరిగిందని తెలిపారు. నేను నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటూ వాటిని చేయిస్తున్నామన్నారు. టెక్నాలజీని బాగా వినియోగించుకుంటున్నామని తెలిపారు ఎక్కడ నేరం జరిగిన సమాచారం వెంటనే తెలిసిపోతుందన్నారు. ఇటీవల సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో కార్తీక మాసంలో రోడ్ల సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని గుర్తించి గజఈతగాళ్లు, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ముగ్గురు భక్తుల ప్రాణాలను కాపాడినారని తెలిపారు. విజయవాడ హాస్పటల్లో ఒక పాపను ఎత్తుకెళ్లడం జరిగిందని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించడం జరిగిందన్నారు. డ్రోన్ లు, సీసీ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలు ఇతర సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
డిజిపి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు, దాతలు ముందుకు రావాలని వారి వారి ప్రాంతాల్లో వారి అవసరాలకు తగినట్లుగా.., దుకాణాలలో కానీ, అపార్ట్మెంట్ వద్ద, వ్యాపార సముదాయాల వద్ద, వారి ఇంటి పరిసరాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. అలా ముందుకు వచ్చిన వారికి పోలీస్ శాఖ తరపు నుండి కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.
అనంతరం కారంచేడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి స్టేషన్ పైన నూతనంగా నిర్మించిన సిబ్బంది విశ్రాంత హల్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజి ఐజి శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాటి ఐపీఎస్ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు, చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఎం.మాలకొండయ్య గారు, పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు, ఇతర పోలీస్ అధికారులు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






