Uncategorized

నేర నియంత్రణకు టెక్నాలజీ… డీజీపీ ద్వారకా తిరుమల రావు

Spread the love

|(విజయనగరం, 28/1/2025,pvginox.com )

||నేరాల నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం||
– రాష్ట్ర డిజిపి సిహెచ్.ద్వారక తిరుమలరావు, ఐపిఎస్

❇️ జిల్లా పోలీసుల పనితీరు భేష్ అన్న రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారక తిరుమలరావు, ఐపిఎస్

❇️ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సంకల్ప రధం’తో చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ని అభినందించిన రాష్ట్ర డిజిపి

రాష్ట్ర డిజిపి మరియు ఆర్టీసి ఎండి శ్రీ సిహెచ్. ద్వారక తిరుమల రావు, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని
జనవరి 28న సందర్శించి, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం, మీడియాతో
సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి సిహెచ్.ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ – ఉత్తరాంధ్ర జిల్లాలను పర్యటిస్తూ, విజయనగరం జిల్లాకు రావడమైందని, జిల్లాలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించా
మన్నారు. నేరాలను నియంత్రించేందుకు, వాటిని ఛేదించేందుకు టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తూ, సఫలీకృతులం
అవుతున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు డ్రోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నామన్నారు. ప్రభుత్వం
సిసి కెమెరాలు ఏర్పాటు చర్యలు చేపడుతున్నప్పటికీ, ప్రజలు, వ్యాపారులు మరిన్ని సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు
రావాలన్నారు. సైబరు మోసాల్లో డిజిటల్ అరెస్టు, సెక్సాటార్షన్, హానీ ట్రాప్లు, లోను యాప్ల పట్ల ప్రజలందరూ
అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా పోలీసులు జమ్ము కాశ్మీర్ వెళ్ళి డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను అరెస్టు చేసి, కేసును ఛేదించడం, రూ.20లక్షల నగదును రికవరీ చేయడం, మరింత నగదును నిందితుడి బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్
చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర డిజిపిగా పోలీసుశాఖకు టెక్నాలజీని చేరువ చేసి, నేరాలను నియంత్రించుటకు
కృషి చేయడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. సైబరు కేసులు మినహా రాష్ట్రలో అన్ని రకాల నేరాలు తగ్గుముఖం
పట్టాయన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేసామని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి
తీసుకొని వెళ్ళి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ఇన్స్పెక్టరు నుండి డిఎస్పీలుగా ఉద్యోగోన్నతులను త్వరలో కల్పిస్తామన్నారు.

గంజాయి నియంత్రణకు ఈగల్ అనే విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసామని, గంజాయి నియంత్రణలో
కింగ్ పిన్స్,గ్యాంగ్ స్టర్స్ అరెస్టు చేసి, క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని మరింతగా విస్తరించి, గంజాయి అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపామన్నారు. గంజాయి నియంత్రణకు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, ఏజన్సీలో గంజాయి సాగును
నియంత్రించామన్నారు. జిల్లా పోలీసుల పనితీరు బాగుందని, మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్పం’ కార్యక్రమంను
జిల్లా ఎస్పీ చేపట్టడం, స్ఫూర్తిదాయకమన్నారు. అదే విధంగా సైబరు మోసాలు, రహదారి భద్రత, మహిళల భద్రత,
మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాల పట్ల ప్రజలు, యువతకు వివరించి, వారిని చైతన్యపర్చేందుకు ‘సంకల్ప రధం’ను
ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న బండి రాజీవ్ @ డాడీ అనే వ్యక్తిపై పి.డి.యాక్టును అమలు చేయడం, ప్రజల నుండి పోలీసులకు మద్దతు లభించడం, వారిని అభినందించడం ఒక శుభపరిణామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేదని, నిఘా వర్గాలు సమర్ధవంతంగా పని
చేస్తున్నాయన్నారు. డిజిటల్ అరెస్టు అన్నది చట్టంలో ఎక్కడా లేదని, ప్రజలు గమనించాలని, సైబరు మోసాలు పట్ల
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారక తిరుమలరావు కోరారు.

ఈ మీడియా సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్
జిందల్, కమాండెంట్ మాలిక గార్గ్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్.వి.మాధవ్ రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *