Uncategorized

భాద్యత ప్రభుత్వం తీసుకుంటుంది… హోమ్ మంత్రి అనిత

Spread the love

(విశాఖపట్నం, 25,జనవరి, 2025,pvginox)

విశాఖ బాలికల సదన్ ను సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

బాలికల సదన్ లో తాజా పరిస్థితిలపై మంత్రి ఆరా.

బాలికలతో మాట్లాడి,యోగక్షేమాలు అడిగితెలుసుకున్న హోం మంత్రి.

హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

విశాఖ బాలికల సదన్ లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారు.

ఇద్దరు బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారు.

ఇద్దరిని బాలికలను మాత్రం సమీపంలో ఉన్నా బాలికల హోంకు పంపించారు.

వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారు.

కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

బాలికల సదన్ లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు.

కొంతమంది బాలికలు మానశికంగా ఇబ్బంది పడుతున్నారు.

వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి.

చిన్న పిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.

తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై ఉన్నారు.

చట్టపరంగా కోర్టులు నుండి ఆర్డర్ వస్తేనే,బాలికలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెలతారు.

పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిది.

ఎవ్వరో గుర్తు చేయాల్సిన అవసరం లేదు.

మా బాధ్యత మాకు తెలుసు.

సమస్య పరిష్కారం అయిన భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడని ఈరోజు బాలికల సదన్ ను సందర్శించాను.

వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో 80 శాతం తప్పులు.

గత ఐదు సంవత్సరాలు అబద్ధాలతో గడిపేసారు.

ఇప్పుడు కూడా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు.

ప్రజలను అన్నింటిని గమనిస్తున్నారు.

తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది.

రామతీర్థం విషయంలో ముద్దాయికి-సాక్షికి తేడా తెలియకపోవడం బాధాకరం.

ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసేశారు.

దావోస్ విషయంలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

చలి అని కబుర్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *