
ప్రతిష్టాత్మక “విశ్వదాత” అవార్డుకు గంట్ల ఎంపిక
ఎలకుర్రులో ఈ నెల 8న ప్రధానం
(విశాఖపట్నం, మే ౩., pvginox.com )
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మహాత్మాగాంధీకి అత్యంత ప్రీతి పాత్రులు,అమృతాంజనం, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక, విశ్వదాత బిరుదాంకితులు కి శే. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు పేరిట అయన జన్మస్థలం కృష్ణా జిల్లా పామర్రు మండలం ఎలకుర్రులోని”విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ “ప్రతి ఏటా ప్రధానం చేసే “విశ్వదాత ” అవార్డుని ఈ ఏడాది జర్నలిజం, సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలందించిన విశాఖకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఎంపికయ్యారు.ఇందుకు సంబందించిన వివరాలు శనివారం వారి కుటుంబ సభ్యులు తెలియచేసారు.కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను స్థాపించి స్వాతంత్ర్య పోరాటంలో అక్షరాయుధాలు అందించారు.దివ్యమైన ఔషదం అమృతాంజనం అయన సృష్టి. శ్యామలా ప్రాధమికోన్నత పాఠశాలను శతాబ్దంకి పూర్వమే స్థాపించి కులమత భేదాలకు తావులేకుండా అన్ని వర్గాలకు, కులాలకు ఉచిత విద్య అందించారు. ఈ పాఠశాలను మహాత్మా గాంధీ మూడుసార్లు సందర్శించారు. ఈ సమయంలోనే ఆయనకు విశ్వదాత అనే బిరుదుతో గాంధీజీ గౌరవించారు.కళాకారుడుగా కూడా ప్రసిద్ధి చెందిన ఆయనకు అన్ని రంగాల్లో నాగేశ్వరరావు పంతులుగారికి ప్రవేశం ఉన్నందునే విద్య, వైద్య, కళా, జర్నలిజం రంగాలలో విశిష్ట సేవలు అందచెసిన ప్రముఖులను విశ్వదాత బిరుదుతో ప్రతియేటా బహుకరించే విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ప్రకృతి అలారారే అయన స్వగ్రామం పదహారణాల పల్లెటూరు ఎలకుర్రులో ఈ నెల 8వ తేదీ సాయంత్రం జరిగే ప్రధానోత్సవ కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబుకు ఈ పురస్కారాన్ని అతిధులు చేతులు మీదుగా అందచేయటం జరుగుతుందని ఫౌండేషన్ కార్యదర్శి, నాగేశ్వర రావు పంతులు గారి మనుమడు కాశీనాధుని నాగేశ్వరరావు శనివారం తెలిపారు.ఇప్పటికే ఈ అవార్డు ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాధ్ లాంటి ప్రముఖులెందరికో ప్రధానము చేసినట్లు నాగేశ్వర రావు తెలిపారు… ఇటువంటి అవార్డు తనకు దక్కడము పట్ల గంట్ల శ్రీను బాబు సంతోషం వ్యక్తము చేసారు.. ఇప్పటి వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లు,, ఎన్నో జాతీయ, ఇతర పురస్కారంలు స్వీకరించినప్ప టికీ ప్రముఖ కాశీ నాధుని నాగేశ్వరరావు పంతులు అవార్డు రావడం చాలా పూర్వ జన్మ సుకృముగా భావిస్తున్నట్లు శ్రీనుబాబుపేర్కొన్నారు.. ప్రతిస్టాత్మక అవార్డు కు ఎంపిక కావడం పట్ల సీనియర్ జర్నలిస్ట్ లు వివిధ జర్నలిస్ట్ సంఘాలు హర్షము వ్యక్తము చేసారు..