(మంగళగిరి, ఫిబ్రవరి 1,2025,pvginox.com)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనితగారు
ఆడబిడ్డలపై అబాండాలేసి వీధిన పెడితే..కచ్చితంగా జైలులో పెడతాం : హోంమంత్రి వంగలపూడి అనిత
ఆడపిల్లలనే కనికరం లేకుండా వైఎస్ఆర్సీపీ నీచంగా ప్రవర్తిస్తోంది
ప్రభుత్వంపై బురదజల్లాలనే లక్ష్యంతో ఏ ఘటన జరిగినా రాజకీయం చేస్తోంది
యువతి, మహిళల మర్యాద, గౌరవాలను వీధిన పెట్టేందుకు తెగిస్తోంది
నిన్న శ్రీకాకుళం డిగ్రీ యువతి ఘటననే అందుకు నిదర్శనం
అమ్మాయిపై భౌతిక దాడి కారణంగా స్పృహ తప్పి పడిపోయింది
దీనిపై తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేశాం
కానీ సాక్షి మీడియా, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన, వైసీపీ నాయకులు లైంగికదాడి అంటూ నీచ ప్రచారానికి తెరలేపారు
అమ్మాయిపై దాడి మాత్రమే జరిగిందని విచారణలోనూ నిర్ధారణ జరిగింది
నిజానిజాలు తేలకుండా ఓ ఆడబిడ్డపై విషప్రచారం చేయాల్సిన అవసరమేంటి?
మానవతా దృక్పథం కోల్పోయి రాక్షసంగా ప్రవర్తిస్తారా? ఆ కుటుంబం పరువు గురించి కనీసం ఆలోచించారా?
తల్లిదండ్రులు కూడా ఆ కోణంలో ఒక్క మాట మాట్లాడకపోయినా మీకెందుకు అంత కుట్రల ఆరాటం?
నందిగామలో ప్రమాదాన్ని కూడా టీడీపీ కార్యకర్తల హత్యగా ఆరోపించడం హేయాతిహేయం
గతంలో పుంగనూరులో ఓ మైనర్ బాలిక హత్య ఘటనను కూడా రేప్ గా చిత్రీకరించాలని తెగ ప్రయత్నించారు
మీ అబద్ధాల ట్వీట్ లతో కుటుంబాలు పడే వేదన తెలుసా?
నిజంగా రేప్ జరిగితే కూటమి ప్రభుత్వం నిందితులను వదిలే ప్రసక్తే లేదు
గంటట్లో స్పందించి పోలీసులు రాజీపడకుండా అదుపులోకి తీసుకుని అరెస్ట్ లు చేస్తున్నారు
ఇటీవల అనకాపల్లి హాకీ క్రీడాకారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే అతన్ని అరెస్ట్ చేశాం
గత ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, విధ్వంసాలు మరచారా?
అరగంట అనేవాళ్లు మంత్రే..గంటనేవాళ్లు కొత్త మంత్రివర్గంలో మంత్రే
కంత్రీ పనులు చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేసినోళ్లు వైసీపీ మంత్రులు, ఎంపీలు
చివరి 20 రోజుల్లో ఘటనలంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది
వైసీపీ అయిదేళ్ల పాలనలో అరాచకాలపై పుస్తకం వేస్తే..ఏం చర్యలు తీసుకున్నారు?
నిందితులకు వంతలు పాడి కాపాడడానికి ఇక్కడున్నది వైసీపీ ప్రభుత్వం కాదు
కూటమి ప్రభుత్వంలో 10 శాతం నేరాలు తగ్గాయి
ఎక్కడికక్కడ డ్రోన్లు, సీసీ కెమెరాలను విరివిరిగా వినియోగించి నేరరహిత సమాజం దిశగా అడుగులేస్తున్నాం
నేరం జరిగిందా లేదా? తేల్చుకోకుండా మానవతా దృక్పథం మరచి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలుంటాయ్
మీ ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారన్న విచక్షణ మరచిపోయి మృగాళ్ల ప్రవర్తించకండి
దిశ యాప్ పని చేస్తే, దిశ చట్టం నిజంగా ఉంటే గత ప్రభుత్వంలో ఆడబిడ్డల అన్ని అత్యాచారాలెలా జరిగాయి?
డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డపై అత్యాచారమనే ప్రచారం వల్ల తర్వాత దుష్పరిణామాలకు బాధ్యులెవరు?
అత్యాచారం జరిగితేనే మీడియాలో పేర్లు రాయకూడదనే చట్టాలున్నా ఆ సున్నితమైన అంశాలు కనపడవా?
ప్రభావితమైన సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించుకోండి
నిజమని తేలేలోపు అబద్ధం అవధులు లేకుండా తిరిగొస్తోంది
విచారణ చేసి చట్టపరంగా చర్యలు చేపడతాం
చిన్న ఆరోపణ చేస్తే గత వైసీపీ ప్రభుత్వం గౌతు శిరీషని సీఐడీ అరెస్ట్ చేసింది
ఆడపిల్లల రక్షణ కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
6 నెలల్లోనే ఓ చిన్నారిపై అత్యాచారం నేపథ్యంలో ఫోక్సో కేసు పెట్టి 20 ఏళ్ల జైలు శిక్ష వేయించిన ప్రభుత్వం మాది