Uncategorized

సి ఆర్ డి ఏ కీలక నిర్ణయాలు

Spread the love

సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద సీఆర్డీ అథారిటీ 47వ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు

రాజ‌ధానిలో ఏడు సంస్థ‌ల‌కు భూముల కేటాయింపున‌కు సీఆర్డీ అథారిటీ ఆమోదం

మంత్రివ‌ర్గ ఉప‌సంఘం తీసుకున్న నిర్ణ‌యాల‌కు అథారిటీ ఆమోదం

E13,E15 రోడ్ల‌ను ఎన్ హెచ్ 16 కు అనుసంధానం చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్

గెజిటెడ్,నాన్ గెజిటెడ్ అధికారుల భ‌వ‌నాల పెండింగ్ ప‌నుల పూర్తికి ఆమోదం తెలిపిన సీఆర్డీ అథారిటీ

వాట‌ర్ ట్రీట్ మెంట్ ప్లాంట్,ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఆమోదం

అమ‌రావ‌తి…

రాజ‌ధానిలో కొత్త‌గా ఏడు సంస్థ‌ల‌కు భూకేటాయింపులు చేస్తూ సీఆర్డీఏ అథారిటీ నిర్ణ‌యం తీసుకుంది.గ‌తంలో 64 సంస్థ‌ల‌కు భూముల కేటాయింపులు పూర్తికాగా తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద జ‌రిగిన సీఆర్డీ అథారిటీ స‌మావేశంలో మ‌రో 7 సంస్థ‌ల‌కు కేటాయింపులు చేసింది అథారిటీ…వీటితో పాటు మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాల‌ను అథారిటీ స‌మావేశంలో తీసుకున్నారు…వాటికి సంబంధించిన వివ‌రాల‌ను పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ మీడియాకు వివ‌రించారు.

2014-19 మ‌ధ్య కాలంలో అమ‌రావ‌తిలో మొత్తం 131 సంస్త‌ల‌కు భూములు కేటాయింపు చేసాం…కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత తిరిగి ఆయా సంస్థ‌ల‌తో ప‌లుమార్లు సంప్ర‌దింపులు జ‌రిపాం…ఎవ‌రెవ‌రు ఎప్పుడెప్పుడు సంస్థ‌ల ఏర్పాటు ప‌నులు ప్రారంభిస్తారు…ఎంతెంత స్థ‌లం అవ‌స‌రం అనే దానిపై చ‌ర్చించాం…కొన్ని సంస్థ‌లు త‌మ కార్యాల‌యాలు ఏర్పాటును త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని చెప్ప‌గా….మ‌రికొన్ని సంస్థ‌లు విత్ డ్రా చేసుకున్నాయి…దీంతో ఆయా సంస్థ‌ల‌కు భూకేటాయింపులు ర‌ద్దు చేసి…కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీలించి భూకేటాయింపులు చేస్తున్నాం…ఈరోజు(మంగ‌ళ‌వారం)జ‌రిగిన కేబినెట్ స‌బ్ క‌మిటీలో ప‌లు సంస్థ‌ల‌కు భూకేటాయింపుల‌కు ఆమోదం తెలిపాం…మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఆమోదం తెలిపిన వాటికి సీఆర్డీఏ అధారిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది…అథారిటీ స‌మావేశంలో కొత్త‌గా ఆరు సంస్థ‌ల‌కు కేటాయింపులు చేసామ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 71 సంస్థ‌ల‌కు కేటాయింపులు పూర్త‌యిన‌ట్లు తెలిపారు…ఆయా సంస్థ‌లు,కేటాయింపుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
క్వాంటం వ్యాలీ – 50 ఎక‌రాలు
లా యూనివ‌ర్శిటీ – 55 ఎక‌రాలు
ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ – 0.78 ఎక‌రాలు
ఐఆర్ సీటీసీ – ఒక ఎక‌రం
బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఫౌండేష‌న్ కు గ‌తంలో కేటాయించిన 15 ఎక‌రాల‌కు అద‌నంగా 6 ఎక‌రాలు
కోస్ట‌ల్ బ్యాంకు – 0.4 ఎక‌రాలు
రెడ్ క్రాస్ సొసైటీ – 0.78 ఎక‌రాలు

మ‌రోవైపు గెజిటెడ్,నాన్ గెజిటెడ్ భ‌వ‌నాలు,మౌళిక వ‌స‌తుల పూర్తికి సీఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది…గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పూర్తికి 514.41 కోట్లు,ఆయా భవనాల వద్ద అదనపు మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూ.194.73 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ అనుమతిచ్చింది…అలాగే ఎన్జీవోల‌కు సంబంధించిన 9 ట‌వ‌ర్ల నిర్మాణానికి 506.67 కోట్ల‌తో,మ‌రో 12 ట‌వ‌ర్ల నిర్మాణానికి,మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.517.10 కోట్ల‌తో టెండ‌ర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింద‌న్నారు మంత్రి.రాజ‌ధానిలో 190 ఎంఎల్డీ సామ‌ర్ధ్యం గ‌ల వాట‌ర్ ట్రీట్ మెంట్ నిర్మాణంతో పాటు ఐదేళ్ల పాటు ఆప‌రేష‌న్ మ‌రియు నిర్వ‌హ‌ణ‌కై 560.57 కోట్ల‌తో టెండ‌ర్లు పిలిచేందుకు అథారిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.అలాగే ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి 494.86 కోట్ల‌తో టెండ‌ర్ల‌కు ఆమోదం ల‌భించింద‌న్నారు..జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానం చేసేలా ఇ-13 రోడ్డును 4.10 కి.మీ మేర 384.78 కోట్ల‌తో,ఇ-15 రోడ్డును 3.98 కి.మీ మేర 70 కోట్ల‌తో మౌళిక స‌దుపాయాల‌తో క‌లిపి పొడిగించేందుకు అథారిటీ నిర్ణ‌యం తీసుకుంది…ఇక సీడ్ యాక్సిస్ రోడ్డు ఇ-3లో 1.5 కి.మీ మేర ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి సీఆర్డీ అథారిటీ ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *