పాపుల కోసం దైవం దిగివచ్చిన వేళ– క్రిస్మస్‌ పండగ

Spread the love

పాపుల కోసం దైవం దిగివచ్చిన వేళ– క్రిస్మస్‌ పండగఎవరి పుట్టిన రోజును వారు మరిచి పోయే ఈ రోజుల్లో ఎవరికి వారు తమ సొంత పుట్టిన రోజుకంటే ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పుట్టిన రోజు వేడుక – క్రిస్మస్‌2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జనం– ఆశ్చర్యం – చారిత్రాత్మకం. కాలాన్ని రెండు శకాలుగా (క్రీస్తు..పూర్వం, క్రీ.శ) విభజించిన యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్దానం (మరణాన్ని గెలిచి)లు, ప్రపంచ పరీక్షలకు తట్టుకుని గెలిచి, ఇప్పుడు మన కళ్ళ ముందు నిలిచిన సజీవ సాక్ష్యాలు. మనిషి దేవున్ని తెలుసుకోలేడని, దేవుని కుమారుడే యేసుక్రీస్తుగా పరంలోకం నుండి భూమిపైకి దిగి వచ్చాడు. అదేక్రిస్మస్‌పాపులను రక్షించేందుకు యొహోవా దేవుని అద్వితీయ కుమారుడు మానవ రూపం దాల్చి ఈ లోకంలో బాల ఏసుగా జన్మించిన చారిత్రాత్మక ఘట్టాన్ని క్రిస్మస్‌గా అచరిస్తారు. క్రైస్ట్‌ (క్రీస్తు), మాస్‌ (ఆరాధన) ఏసు క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్‌. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్‌. క్రిస్మస్‌ పండుగను ఆ«ధ్యాత్మిక అలంకరణలతో, భక్తి శ్రధ్దలతో జరుపుకునేందుకు క్రైస్తవులు సంసిద్ధమయ్యారు. బైబిల్‌ను అనుసరించి ఏసుక్రీస్తు జననానికి సంబంధించిన ప్రవచనాలు, లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఏసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని, ఆయన పుట్టుకకు ముందే ఎన్నో సంవత్సరాలుగా ప్రవక్తలు లేఖనాల్లో తెలియచేశారు. ఆ లేఖనాలు నెరవేరుతూ యొహోవా దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ఈ లోకానికి రెండువేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట వచ్చారు. ఏసుక్రీస్తు పుట్టుక లోక తీరుకు అతీతం..ఏసు క్రీస్తు జననం సాధారణ లోక తీరుకు అతీతంగా జరిగింది. చరిత్రలో ఇందుకు సాక్ష్యాలుగా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎన్నో వాద ప్రతివాదనల అనంతరం ప్రపంచం ఆ అంశాలను అంగీకరించింది. వాటిలో కన్య మరియ గర్భ«ందాల్చడం ప్రధానమైంది. పెళ్ళి కాకుండానే కన్యకు గర్భం ఎలా వస్తుంది అనే ప్రశ్నకు పరిశుద్ధ ఆత్మవలన కలిగిన దైవ వరం… అది చరిత్రలో రుజువైంది. పాపులను రక్షించేందుకు పాపరహితుడు అవసరం కావడంతో దేవుని కుమారుడు పాపరహితుడుగా మానవుడిగానే జన్మించాల్సి వచ్చింది. దైవకుమారుడు బెత్లెహెమ్‌ నగరంలో జన్మిస్తే ఆ పసికందును ఉంచేందుకు సత్రంలో కూడా స్థలం దొరకలేదు. చివరికి పశువుల తొట్టిలో ఆ పసికందును పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టాల్సి వచ్చింది. దైవ కుమారుడు ఒక నిరుపేదగా అవతరించాడు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు రాత్రి ఆ శుభవార్తను పరలోక దేవదూతల సైన్యం గొల్లలకు పాటల రూపంలో రక్షకుడు పుట్టాడని సమాచారం అందించాయి. ఆ పాటలకు ప్రతి రూపంగా క్రైస్తవులు క్యారల్స్‌ను నిర్వహిస్తారు. ఏసుక్రీస్తు పుట్టిన రాత్రి ఆకాశంలో ఒక వింత పెద్ద నక్షత్రం పుట్టింది. ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ నక్షత ప్రస్తావన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందని గ్రహించి తూర్పు దేశాల నుంచి జ్ఞానులు ఆ నక్షత మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసి ఏసుక్రీస్తును కనుగొని బంగారం, సాంబ్రాణి, గోళము కానుకలుగా సమర్పించి చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచారు. ఈ ప్రేరణతో పేదలకు కానుకలు ఇవ్వడం క్రైస్తవులకు ఆనవాయితీగా మారింది. ఈ ప్రక్రియలో శాంతాక్లాజ్‌ (క్రీస్మస్‌ తాత) ప్రపంచానికి సుపరిచితం.సర్వోన్నతుడు పాపుల కోసం పరలోకాన్ని వీడి మామూలు మనిషిగా నిష్కల్మషంగా జీవితాన్ని గడిపి సిలువుపై మరణించి పాపులకు రక్షణ కల్పించాడు. ఈ క్రీస్తు జీవిత వృత్తాంతాన్ని గడిపి సిలువుపై మరణించి పాపులకు రక్షణ కల్పించాడు. ఈ క్రీస్తు జీవిత వృత్తాంతాన్ని ముఖ్యంగా క్రిస్మస్‌ సంబరాలను చేసుకునే నేపథ్యంలో అలనాటి ఘట్టాలకు సంబంధించిన వాటిని క్రిస్మస్‌ అలంకరణలుగా చేస్తారు. పశువుల శాలలో జన్మించాడు. కాబట్టి పశువుల శాలను దేవదూతలు దిగి వచ్చారు కాబట్టి దూతల ప్రతి బింబాలను, మొదటి సువార్త గొర్రెల కాపరులకు దూతల అందించారు కాబట్టి గొర్రెల కాపరులను, గొర్రెలను ఆకాశంలో నక్షత్రం ఉదయగించింది. కాబట్టి స్టార్స్‌ను ఒంటెలపై జ్ఞానులు పయనించడాన్ని ముఖ్య అలంకరణలుగా క్రీస్తు పుట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ క్రైస్తవ గృహాల్లో అలంకరణలు చేస్తారు. కాలక్రమంలో క్రిస్మస్‌ ట్రీలకు బహుమతులు కట్టి అందచేయడం, దేదీప్యమాన దీపాలతో గుడులను అలంకరించడంతో క్రీస్మస్‌ అలంకరణలు చారిత్రాత్మక నేపథ్యమే కాకుండా గుడులు విద్యుత్‌ దీపాలకరంణలలో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. క్రీస్మస్‌ పండుగను ఆచరించడంక్రిస్మస్‌ పండుగను ఆచరించడంలో క్రైస్తవులు ముందస్తు క్రిస్మస్‌ ఒక నెల రోజులు ముందే మొదలు పెడతారు. ఇళ్ళకు వెళ్లి క్యారల్స్‌ నిర్వహించడం, సండే స్కూల్‌ చిన్నారుల నాటికలు, స్కిట్‌లతో పాటు ఏసుక్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపే సంగీత రూపకాలు, గాన జయంతి, గానలహరులతో క్రిస్మస్‌ సంబరాలు నిర్వహించడం పరిపాటి. డిసెంబర్‌ 24వ తేది అర్థ రాత్రి నుంచే అన్ని క్రైస్తవ సంఘాల్లో ప్రత్యేక ఆరాధనలు ప్రారంభమౌతాయి. గాన, ప్రతిగానాలు, సంగీత ప్రాధాన్యత కలిగిన ఆరాధనలు చేస్తూ క్రైస్తవులు వారికే కాకుండా తమ చుట్టు పక్కల ఉన్నవారికి కానుకలు ఇవ్వడం శుభాకాంక్షలు తెలపడం చేస్తారు. ‘‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించి’’ అని ఏసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తారు. ప్రపంచంలో శాంతిని ప్రాసాదించే ఏసుక్రీస్తు బోధనలు నేటికి అవసరం ఉంది.ప్రంపచానికి సందేశం… ఏసుక్రీస్తును గూర్చి ప్రవక్తల లేఖనాలు నెరవేరి మానవ జాతికి అనేక అమూల్య అంశాలను ఏసుక్రీస్తు జననం తెలియచేస్తుంది. ఏసుక్రీస్తు దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ పెరిగి దేవుని ప్రేమను మానవాళిక చవిచూపాడు. కళంకరహిత జీవితం గడిపి, శ్రమలకు లోనై, పాప బా«రంతో సిలువనెక్కి అమూల్య రు«ధిరం చిందించి, పాప ప్రక్ష్యాళన గావించి, మరణాన్ని జయంచి రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. క్రీస్మస్‌ అంటే క్రీస్తును స్మరించడం.. క్రిస్మస్‌ ప్రతి యేడు వస్తుంది. అలనాటి పశువులశాల పసిడి కాయలను, దూతల సన్నుతి గీతాలను, నక్షత దివ్యకాంతులను, రారాజును చూడాలని తూర్పు దేశపు జ్ఞాలను ప్రయాసలను గుర్తు చేస్తూ క్రిస్మస్‌ పండుగను జరుపుకుంటారు. ఒక పాపి మరో పాపికి రక్షణ ఇవ్వలేడని, పాపరహితుడు, ఏసుక్రీస్తు సిలవపై బలి అయ్యి, మరణించి చావుని గెలిచి పాపికి రక్షణను ఇచ్చాడు. అదే ఈస్టర్‌.క్రీస్తు పుట్టుక, మరణం, మరణాన్ని జయించడం లోకరీతికి అతీతం. ప్రపంచంలోని అన్ని సమాధులలో యేసు క్రీస్తు సమాధి ఒక్కటే ఖాళీగా ఉండడం చారిత్రాత్మక సత్యం.చావుని గెలిచి రక్షణను మానవాళికి అందించిన రక్షకుడు యేసు క్రీస్తును హృదయంలో చేర్చుకుంటే చాలు. ఇక మనం ఏమీ చేయనక్కరలేదు. కులమతాలతో అవసరం లేదు నేనే మార్గం, సత్యం, జీవం అన్న యేసు క్రీస్తు బోధనలను పాటిస్తే పాపపు చీకటి నుంచి నిత్య వెలుగులోకి నడిపిస్తాడు.తరాల తరబడి నడిపిస్తూనే ఉన్నాడు.అందుకే వేల సంవత్సరాల నుంచి క్రిస్మస్‌ పండుగ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంది.క్రిస్మస్‌ ఈజ్‌ యూనివర్శల్‌ ట్రూత్‌… యూనివర్శల్‌ ఫెస్టివల్‌హెవెన్లీ జాయ్‌ ఆన్‌ ఎర్త్‌…(భూమీ మీద పరలోక సంతోషం.) విష్‌యూ ఏహ్యాపీ క్రిస్మస్‌….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *