జనవరి నుంచి గార్మెంట్ రంగంలో 45 రోజులపాటు ఉచిత నైపుణ్య శిక్షణ
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు నాణ్యమైన జుకీ మెషిన్లు (Juki Machines) పంపిణీ
సెంచూరియన్ యూనివర్సిటీ సహకారంతో పరిశ్రమలతో మహిళల భాగస్వామ్యం
పీస్ వర్క్ ఆధారంగా మహిళలకు నిరంతర ఉపాధి అవకాశాల కల్పన
రాష్ట్రంలోని గ్రామీణ మహిళలు ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధిని సాధించేలా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్), బీసీ సంక్షేమ శాఖ సంయుక్తంగా జనవరి నుంచి సరికొత్త నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. గ్రామీణ మహిళలు గార్మెంట్ రంగంలో తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేలా ఈ పథకం రూపకల్పన చేశారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది గ్రామీణ మహిళలను ఈ పథకంలో భాగస్వాములుగా ఎంపిక చేస్తారు. వారందరికీ 45 రోజులపాటు గార్మెంట్ రంగంలో మెళకువలు నేర్చుకునేలా ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళకు సీడాప్, బీసీ సంక్షేమ శాఖ సహకారంతో నాణ్యమైన జుకీ మెషిన్లు (Juki Machines) అందజేస్తారు.
శిక్షణ పూర్తయిన అనంతరం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా, ఇతరులకు ఉపాధి కల్పించేలా ఆయా పరిశ్రమలతో అనుసంధానించేందుకు సెంచూరియన్ యూనివర్సిటీ పనిచేయనుంది. పరిశ్రమల నుంచి ఆర్డర్లు అందిన తర్వాత, మహిళలకు పీసువర్క్ ఆధారంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమల సహకారంతో, మహిళలు గార్మెంట్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కావాల్సిన అన్ని వనరులు ఈ పథకం ద్వారా అందించబడతాయి.
ఈ కార్యక్రమంలో బీపీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ మంత్రి సవిత, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ మళ్లికార్జున, సీడాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. శ్యామ్ ప్రసాద్, సీడాప్ స్టేట్ మిషన్ మేనేజర్ విజయ్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి జేఎం రావు తదితరులు పాల్గొన్నారు