దస్తావేజు లేఖనంలో ప్రజలారా జాగ్రత్త వహించండి.
*ప్రావీణ్యం కలిగిన దస్తావేజు లేఖరుల అసోసియేషన్ సభ్యులతోనే దస్తావేజులు వ్రాయించుకోండి.
(అమరావతి, 19/1/2025)
NTR జిల్లా అధ్యక్షులు పైలా సతీష్ మాట్లాడుతూ దస్తావేజు లేఖర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయమై ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ ఐజి అండ్ కమిషనర్ గారిని, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులుశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుని దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు జారీ చేయాలని కోరగా వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ మధ్యకాలంలో దస్తావేజు లేఖరుల వృత్తి దారులుగా పేరు పెట్టుకొని దస్తావేజు లేఖనం లో అనుభవం లేని ఎంతోమంది తప్పుడు దస్తావేజులు వ్రాస్తూ, అనేక అవకతవకులకు పాల్పడుతూ కక్షిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తమ అసోసియేషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు.
కావున ప్రజలు దస్తావేజులేఖర్ల అసోసియేషన్ సభ్యులతోనే దస్తావేజులు రాయించుకోవాలని తద్వారా బాధ్యతాయుతంగా వారు రాసే దస్తావేజుల వల్ల ప్రజల ఆస్తులకు ఏమాత్రం డోకా ఉండదని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గత 150 ఏళ్లు పైబడి ప్రజలకు సేవలు అందిస్తున్న దస్తావేజులేఖనం వృత్తి ఎంతో గౌరవమైనదని దాన్ని అగౌరవపరిచి, వృత్తికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులను తమ అసోసియేషన్ సహించబోదని హెచ్చరించారు.
కనీసం ఈ కూటమి ప్రభుత్వంలోనైనా దస్తావేజులేఖర్లకు లైసెన్సులు ఏర్పాటు చేస్తే ప్రజల ఆస్తులకు మరింత రక్షణ వ్యవస్థగా, జవాబుదారీగా నిలిచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా దస్తావేజులేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షులు పైలా సతీష్,విజయవాడ అధ్యక్షులు చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి శీతేపల్లి శేషు కుమార్,కోశాధికారి చిట్టా శ్రీకృష్ణుడు, ఆర్కే సాంబశివరావు లోకేష్,మండా భరత్ తదితర దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.