మల్కాజిగిరి లో వైభవంగా రన్ ఫర్ భారత్ మాత
(మల్కాజిగిరి, హైదరాబాద్) భరతమాత పట్ల భక్తి నింపే భాగంగా మల్కాజిగిరి లో “రన్ ఫర్ భారత్ మాత” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సఫిల్ గుడా నుండి ఈస్ట్ ఆనంద్ బాగ్ మీదగా సఫీల్ గుడా వరకు సుమారు 5 కిలో మీటర్ల రన్ నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి ధామం పీఠాధిపతి శ్రీశ్రీ రామానంద ప్రభూజి పాల్గొన్నారు, ముఖ్య వక్తగా ABVP మాజీ జాతీయ అధ్యక్షలు మురళి మనోహర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మురళి మనోహర్ మాట్లాడుతూ ఈ ఐదు కిలోమీటర్లు రన్ భరతమాత వైభవాన్ని చాటటానికి నిర్వహించడం జరుగుతొందని , మనలో ఎందరో మన దేశ చరిత్ర వైభంవం తెలవక భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటామని తెలిపారు. భారతీయులందరూ తమ మాతృభాషలో రాణించే విధంగా ముందుకు సాగాలని , కుల ప్రస్తావన లేకుండా సామాజిక సమరసత భావంతో ఉండాలని ఇదే సనాతన ధర్మం చెబుతుందని , దీనికి ఉదాహరణ కుంభమేళ అని ప్రస్తావించారు.