(సత్యసాయి జిల్లా, 21/1/2025,pvginox )
ఈరోజు సత్యసాయి జిల్లాలో పర్యటించిన గౌరవ డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు ఐపిఎస్ గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం: డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు గారు
గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్ పెట్టాం:
- రాష్ట్రవ్యాప్తంగా 100 ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు.
- ఒరిస్సా నుంచే ఎక్కువగా అక్రమ రవాణా.
- ఎక్కడ గంజాయి దొరికినా… ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలోనే అనేది కేవలం అపవాదు మాత్రమే.
సైబర్ నేరాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి - టెక్నాలజీ సాయంతో నేరాల నియంత్రణకు కృషి
- సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు బాగా తగ్గాయి
మీడియా సమావేశంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు…
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల నేరాలను నియంత్రించి త్వరలోనే రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను మార్చడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని డిజిపి గారు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో డిఐజి షిమోషి, జిల్లా ఎస్పీ వి రత్న గారితో కలిసి డిజిపి గారు మీడియాతో మాట్లాడారు.
ఇటీవల జిల్లా పోలీసు అధికారులు విడుదల చేసిన శాంతిభద్రతలు- నేర నివేదిక 2024 ప్రకారం జిల్లాలో అన్ని రకాల నేరాలు దాదాపు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళ ఆట కట్టించడంతో పాటు ఆర్థిక నేరాల నియంత్రణలో జిల్లా పోలీసు అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు.
రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలావరకు తగ్గిందన్నారు. సైబర్ నేరాలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫలితంగా బాధితులు సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తుండడం అభినందనీయమన్నారు.
ప్రతిరోజూ కోట్లాది రూపాయలు సైబర్ నేరగాళ్లపాలు అవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. ప్రధానంగా పాస్ పోర్టు, ఆధార్ నంబర్లు వంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఓటిపి చెప్పమని ఫోన్ వస్తే.. అసలు స్పందించవద్దని డీజీపీ తెలిపారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక వీడియోలు, ఆడియోల రూపంలోనూ, విద్యాసంస్థల్లో, ప్రత్యేక సదస్సులు, ర్యాలీల ద్వారా అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల, రాంగ్ డైరెక్షన్, అధిక వేగం తదితర కారణాలవల్ల ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా మైనర్లు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం అంటే… లైసెన్స్ లేని తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరపడమేనని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా కూడా రాష్ట్రంలో బాగా తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రస్తుతం కేవలం 100 ఎకరాల్లో మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగు ఉందన్నారు. ఈ సీజన్ లో పూర్తిగా గంజాయి తోటలను తొలగించామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హోం మంత్రితోపాటు, ఎక్సైజ్, హెచ్ ఆర్ డి, హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ల ఆధ్వర్యంలో నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పడిందని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికను అవలంబిస్తున్నామన్నారు.
గంజాయి డ్రగ్స్ కార్యకలాపాలను నియంత్రణకు ప్రభుత్వం ఈగల్ సెల్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిందని ఏర్పాటు చేసిందన్నారు అన్నారు.
శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ గారు…
గౌరవ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపిఎస్ గారు మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికు కుల్వంత్ హాల్లో శ్రీ సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకున్న డీజీపి గారికి పోలీస్ గెస్ట్ హౌస్ లో అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షేముషి , జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న, పుష్పగుచ్చములు అందజేసి స్వాగతం పలికారు. గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం , ప్రశాంతి నిలయంకు చేరుకున్న డిజిపి గారికి ట్రస్ట్ వారు స్వాగతం పలికారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డిగారు డిఐజి ,ఎస్పి గారితో కలిసి సాయి కుల్వంత్ హాల్ లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని డీజీపీ గారు దర్శించుకున్నారు.