Uncategorized

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

Spread the love

కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన

•జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం

(అమరావతి, 21/1/2025,pvginoxtelugunews )

జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.

Shri @PawanKalyan Garu
@JanaSenaParty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *