కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు
చారిత్రక నిర్ణయం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత
(అమరావతి : 21/1/2025 pvginox)
కల్లుగీత కార్మికులకు 340 మద్యం షాపుల కేటాయిస్తూ జీవో జారీ చేయడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. మద్యం షాపుల లైసెన్స్ ఫీజులోనూ 50 శాతం రాయితీ ఇవ్వడంపైనా ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదో చారిత్రక నిర్ణయమని కొనియాడారు. ఈ మేరకు మంగళవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటికీ నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. దీనిలో భాగంగా కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయిస్తామని చెప్పిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు. కల్లు గీత కార్మికులకు 340 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వడంపైనా ఆమె హర్షం వ్యక్తం చేశారు. మద్యం షాపుల కేటాయింపుతో కల్లు గీత కార్మికుల కుటుంబాలకు ఎంతో ఆర్థిక లబ్ధి కలుగుతుందన్నారు. లైసెన్స్ ఫీజులో రాయితీ ఇవ్వడం వల్ల ఆర్థిక మేలు కలుగుతుందన్నారు. తమది మరోసారి బీసీల ప్రభుత్వమని నిరూపితమైందన్నారు. బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత స్పష్టంచేశారు. గత బడ్జెట్ లో ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో బీసీలకు రూ.39,007 కోట్లు కేటాయించామన్నారు. బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు నియమించడమే కాకుండా నిధుల సైతం సీఎం చంద్రబాబునాయుడు కేటాయించిన విషయాన్ని మంత్రి సవిత ఆ ప్రకటనలో గుర్తు చేశారు.