(తిరుపతి, 21/1/2025,pvginox.com )
పార్టీ విస్తరణ నా లక్ష్యం. ప్రతీ కార్యకర్తను కలుపుకుపోతా. కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీల కలయిక.
బిజెపి తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులు సామంచి శ్రీనివాస్…
కూటమి అధికారంలోకి రావడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి పట్టుదల విలువైనది అన్నారు. అభివృద్ధి నినాదంతో పనిచేస్తున్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తున్న బిజెపి అదే స్థాయిలో పార్టీని కూడా పెంచుకోవడానికి అందరూ కలిసి పని చేద్దామని సామంచి అన్నారు. నిష్టా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు.
ప్రతిష్టాత్మకంగా ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉదయం జరిగిన తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికలు జరిగినాయి.
జిల్లా ఎన్నికల అధికారిగా విచ్చేసిన సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ సామంచి శ్రీనివాస్ అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మట్టా ప్రసాద్ మాట్లాడుతూ సామంచి నాయకత్వంలో పార్టీ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్,డా.చంద్రప్ప, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, కండ్రిగ ఉమా, ఎస్ఎస్ఆర్ నాయుడు,రాటకొండ విశ్వనాథ్, సుబ్రమణ్యయం యాదవ్, పొనగంటి భాస్కర్, అజయకుమార్, వర ప్రసాద్, పెనుబాల చంద్ర శేఖర్, బి డి బాలాజి, వెంకటముని, డా. శ్రీ హరి రావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సామంచి శ్రీనివాస్ కి బిజెపి నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, సేహ్నతులు, వివిధ మోర్చాల నాయకులు, వివిధ సెల్స్ నాయకులు, ఘనంగా పూలమాల తోను, పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించి సత్కరించినారు.