ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు…..
అధికారులు సమన్వయంతో పటిష్ట యేర్పాట్లు చేయండి…
కూచిపూడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించండి…
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
ప్రసిద్ధి నాట్య క్షేత్రమైన కూచిపూడిలో నిర్వహించనున్న కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలను శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఈనెల 27 నుండి 29 వరకు మూడు రోజులు పాటు కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి లో నిర్వహించనున్న కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల కు చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం కూచిపూడిలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూచిపూడి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.
కూచిపూడి నాట్య క్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 న ప్రారంభోత్సవంతో 29 వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలన్నారు. కార్యక్రమాలు సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు దేశ విదేశాల నుంచి ముఖ్యంగా రష్యా, కెనడా, అమెరికా, జపాన్, జర్మనీ నుండి కళాకారులు తరలి రానున్నార న్నారు. 29వ తేదీ ఆదివారం రెండు వేలకు పైగా కళాకారులతో మహా బృంద నృత్యం ఉంటుందన్నారు.
కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల ద్వారా కూచిపూడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సంకల్పంతో నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడికి గుర్తింపు తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీచర్చ అండ్ ట్రైనింగ్ సెంటర్ ( ఎన్సీఈఆర్టీ) సీఈవో డా. తాడేపల్లి , జిల్లా పర్యాటకశాఖ అధికారి రామ లక్ష్మణ్, కూచిపూడి హెరిజేట్ ఆర్ట్స్ సొసైటీ ఉత్సవ కమిటీ కన్వీనర్, ప్రవాస భారతీయుడు డా.వేదాంతం వెంకటనాగచలపతిరావు, కూచిపూడి కళాపీఠం వైస్ ప్రిన్సిపల్ డా. చింతా రవిబాలకృష్ణ ఉన్నారు.
డిఐపిఆర్ఓ….
ఐ&పిఆర్, మచిలీపట్నం నుండి జారి