జెసిఐ 46వ అధ్యక్షుడిగా వేముల శ్రావణ్ కుమార్.
అట్టహాసంగా బాధ్యతలు స్వీకరణ
2025 లో ప్రజలకు తమ వంతు సేవలు
( సిరిపురం.. జనవరి 25.2025,pvginox )

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వాల్తేరు 46వ అధ్యక్షుడిగా నగరానికి చెందిన వేముల శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం అట్టహాసంగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాల్తేర్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జోన్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెసిఐ నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు మన్ననలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. జోన్ పరిధిలో గత ఏడాది కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశంలో జేసీఐ
తమ సేవలు అనేక రూపాల్లో కొనసాగిస్తుందన్నారు. నగర ప్రజలకు కూడా పలు సందర్భాల్లో సేవలు అందించి జేసీఐ అండగా నిలిచిందన్నారు. అంతేకాకుండా సేవలకు ప్రతిరూపంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. నూతన కార్యవర్గాన్ని గంట్ల శ్రీను బాబు అభినందించారు. 46వ జేసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వేముల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకాకుండా తన సాయి శక్తుల జేసీఐ ను బలోపేతం చేస్తామన్నారు. ఛాంబర్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 2025 లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఇప్పటికే తగిన ప్రణాళిక లు సిద్ధం చేశామన్నారు. ఆందరి సహకారంతో ఆయా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.తొలుత 45 వ అధ్యక్షులు ప్రతాప్ కుమార్ నూతన అధ్యక్షులు శ్రావణ్ కుమార్ తో పదవీ ప్రమాణం చేయించగా నూతన కార్యవర్గం చేత నూతన అధ్యక్షులు శ్రావణ్ ప్రమాణం చేయించారు.


జే సి ఐ 46వ ఛాంబర్ నూతన కార్యవర్గం.
ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా వేముల శ్రావణ్ కుమార్,కార్యదర్శిగా రిషి కృష్ణ కోశాధికారిగా మిత్ర తేజతో పాటు మరో 12 మంది నూతన కార్యవర్గంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ తో పాటు నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా సత్కరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఒబేద్ పూర్వపు అద్యక్షులు డివి సతీష్, బొడ్డు రఘు,వినీత్ జైన్,ఎస్ సతీష్ సాయినాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

