అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్…
• కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు 151 సీట్లు ఇస్తే పాలన చేతకాక ఓట్లేసిన ప్రజలకు ద్రోహం చేసిన జగన్ అండ్ కో నాడు చేసిన తప్పులకు నేడు కర్మ అనుభవిస్తున్నారు. ప్రజల తీర్పుని గౌరవించకుండా మతిభ్రమించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.
• వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరాయంగా పని చేస్తున్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే మీరు చేయాల్సింది వర్క్ ఫ్రం బెంగళూరు కాదు.. మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో మీరెంతో మేమూ అంతే.
• ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మెజారిటీ ఎలా కావాలో.. ప్రతిపక్ష నేత అవ్వాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
- వైసీపీ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లాంటిది. కూటమి ప్రభుత్వం టీమిండియా లాంటిది. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే దుబాయ్ లో ఇండియా టీమ్ పాకిస్థాన్ కి చేసిన సినిమానే చేసి చూపుతాం.
• వైసీపీ చేతకాని పాలన వల్ల రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయింది. మిమ్మల్ని గెలిపించిన ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ నిధులు కొట్టేసి వారికి మొండి చెయ్యి చూపిన చేతకాని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి..
• జగన్ రెడ్డి అవినీతికి అంతమే లేదు. 2004లో నీ ఆస్తి ఎంత.. 2019 తర్వాత నీ ఆస్తి ఎంత. నీ ప్రభుత్వంలో సలహాదారుల పేరిట రూ. 680 కోట్ల దుర్వినియోగం నిజం కదా? నీ కుటుంబ విలాసాల కోసం రూ. 550 కోట్లతో ప్యాలెస్ కట్టించిన మాట వాస్తవం కాదా? అనిమాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా.
• తమ అధినేత పుట్టుకతోనే ఎంపీ అని అంబటి రాంబాబు చెబుతున్నాడు. జగన్ తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే ఎంపీ కాదు కదా కౌన్సిలర్ కూడా అయ్యేవాడు కాదు. మా నాన్న గారు సీఎం అయ్యి ఉంటే నేను సీఎం అయ్యే వాడిని. అక్రమార్జనతో పేద ప్రజలకు ఎరవేసి.. సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
• అంబటి రాంబాబు అనే ఎరను పెట్టి ఏదో ఒకటి మాట్లాడించి దుష్ప్రచారం చేస్తున్నాడు. గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజం అయిపోతుందా? పవన్ కళ్యాణ్ గారు ఓడినా గత పదేళ్లుగా ప్రజల్లోనే ఉండి సమస్యల మీద పోరాటం చేశారు. సోషల్ మీడియా అరెస్టులు, జైలు సంస్కృతిలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని అన్యాయంగా అరెస్టు చేసి 51 రోజులు జైల్లో ఉంచితే ఇప్పటికీ ఆ కేసు రుజువు కాలేదు.
• శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మా పార్టీ పీఏసీ ఛైర్మన్. ఆయనకు మేమంతా గౌరవం ఇస్తాం. ఆయన గురించి అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊకోం. అసలు బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. ఒక ద్వారంపూడి, ఒక రంగనాథరాజు, ఒక పేర్ని నాని అంతా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేషన్ మాఫియాగా తయారయ్యారు.
• శ్రీ మనోహర్ గారు పౌరసరఫరాల శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి. కాకినాడలో అక్రమ రవాణాని ఆపడం గాని, మీ గోడౌన్లలో జరిగిన దొంగతనాలు గాని బయటపెట్టిన వ్యక్తి ఆయన. ఆ అక్కసుతోనే శ్రీ మనోహర్ గారిపై నిందలు వేస్తున్నారు.
• నీటి పారుదల మంత్రిగా చేసిన రాంబాబుకి క్యూసెక్కులకు అర్థం తెలియదు. డయాఫ్రం వాల్ అంటే తెలియదు. కనీసం గుంటూరు జిల్లాలో పంట కాలవల్లో పూడికలు తీయించావా? నువ్వు మాట్లాడుతున్నావు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి పోయాక.. మీ పార్టీ ఇంఛార్జ్ పదవి కూడా పీకేశాక అంబటి రాంబాబు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతావు.
• దమ్ముంటే మీ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా మీ పార్టీ అవినీతి, అక్రమాలే బయటకు వస్తున్నాయి. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు. పల్లెటూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించని దుర్మార్గ ప్రభుత్వం అలాంటి పల్లెటూళ్లను బాగు చేస్తున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీలకతీతంగా గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం పూర్తి చేసిన ఘనత జనసేన పార్టీకి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది.
• ఓటమి అక్కసుతో నోటికి వచ్చింది మాట్లాడడం కరెక్టు కాదు. ముఖ్యమంత్రి పదవి ఊడి ఎమ్మెల్యేగా మిగిలిపోయిన నువ్వు .. నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇన్నాళ్లు మీ కుటుంబాన్ని గెలిపించిన పులివెందులకు మీరు ఏం చేశారు. మీ సొంత బాబాయ్ హత్యకు గురైతే ఆ కేసు ఇప్పటికీ తేలని పరిస్థితి. వివేకానందరెడ్డి గారి చావునీ, కోడి కత్తి డ్రామాలు ఆడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొన్న గులకరాయి డ్రామా ఆడితే అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. ప్రజలకు మీ డ్రామాలు తెలిసి ఓడించారు.
• సొంత చెల్లి మీదే పోస్టులు పెట్టిస్తావు.. నీకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మనోహర్ గారు ఒక లెక్కా. మాజీ స్పీకర్ కోడెలను వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. రుషికొండలో రూ. 550 కోట్లతో ప్యాలెస్ ఎందుకు కట్టారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.
• మీ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడారు. ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారు. కార్పోరేటర్లు, మేయర్లు వైసీపీని వీడిపోతున్నారు. మీ పార్టీలో ఉంటే ఈడీ కేసుల్లో ఇరికిస్తారేమోనని భయపడి అంతా పారిపోతున్నారు.
• రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని మీ స్వార్ధం కోసం వాడుకున్నారు. కేంద్రం నుంచి ఇది తెచ్చుకున్నాం అని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి. ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకున్నారు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. వెయ్యి రూపాయిలు పెంచేందుకు ఐదేళ్లు సమయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ పెంచి ఇచ్చింది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
• అంబటి రాంబాబు మా గురించి జాలి పడనవసరం లేదు. సత్తెనపల్లిలో మీ స్నేహితురాలి తో పెట్టించిన వృందా డిగ్రీ కళాశాలలో మాస్ కాపియింగ్ చేయించిన మాట వాస్తవం కాదా? విద్యార్ధుల దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు అధికారం పోయాక కాలేజీ మూసేసి, తల్లిదండ్రులకు డబ్బులు తిరిగి కట్టని మాట వాస్తవం కాదా? ఇంతకీ ఆ కాలేజీ ఎవ్వరిదో చెప్పగలవా అని అంబటి రాంబాబుని ప్రశ్నిస్తున్నాం.
• ఓటమిలోనూ ప్రజల మధ్యన ఉండి ప్రజల కష్టాలు తీర్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నీ సొంత నియోజకవర్గంలో కౌలు రైతు కుటుంబాలకు ఆయన రూ. 24 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేమి చేశావో చెప్పాలి.