తిరుపతి పై బీజేపీ స్పెషల్ ఫోకస్
జిల్లా అధ్యక్షుని ప్రమాణ స్వీకారంలో బల నిరూపణ
వ్యూహత్మకంగా సామంచి శ్రీనివాస్ ఎంపిక
మంత్రి సత్యకుమార్ మంత్రాంగం…
(తిరుపతి, 29/1/2025,pvginox.com)

భారతీయ జనతాపార్టీ……అట్టహసాలు, ఆడంబరాలకు దూరంగాకార్యక్రమాలు….తాము పార్టీ తమకేమిస్తుంది అని కాకుండా.. పార్టీకి తాము ఏమిస్తామనే ఆలోచనా విధానం కలిగిన నాయకులు, కార్యకర్తలు ఉండడం….అన్నింటికంటే దేశమే ముఖ్యమన్న భావన నర నరాన్న జీర్ణించుకున్న బలగం ఆ పార్టీ సొంతం..ఈనేపథ్యంలో బుధవారం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అత్యంత అత్తహసంగా జరిగింది.. మునుపెన్నడు లేనివిధంగా తిరుపతి నగరం లో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మిగిలిన పార్టీలకు ధీటుగా నిర్వహించడం, ఎన్ డి ఏ మిత్ర పక్షాలైన తెలుగుదేశం, జనసేన శాసన సభ్యులను భాగస్వాములను చేయడం, బీజేపీ కి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, టార్గెట్ చేదించడంలో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న సత్యకుమార్ సైతం హాజరై, కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని, రాష్ట్ర అభివృద్ధిలో తమ భాగస్వామ్యం మెండుగా ఉందని బల్లగుద్ది మరీ చెప్పడం తిరుపతి పై పట్టుకోసమేనని మేధావులు చర్చించుకుంటున్నారు.. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లాలో బీజేపీ చేసిన పోరాటాలు, మదనపల్లి కేంద్రంగా వామపక్ష తీవ్రబాదులతో పోరాటాలు విడమరచి చెప్పడం ద్వారా ఆ పార్టీ గొప్పతనాన్ని ఇప్పటి తరానికి వివరించినట్లయింది. తద్వారా తాము మిగిలిన పార్టీలకు తక్కువకాదన్న సంకేతాన్ని మిగిలిన భాగస్వామ్య పార్టీలకు ఇవ్వడమే కాకుండా, ప్రజలకు చేరువయ్యేందుకు సామంచి శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది..

వ్యూహం ఆయనదేనా…
భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వేల్లూనుకోవాలనుకుంటూది.. ఈ క్రమంలో రాయలసీమ పై ద్రుష్టి సాధించింది.. ఇప్పటికే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇంకా పలువురికి పార్టీ లోకి ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి. పార్టీకి వీర విధేయుడిగా ఉన్న మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో కీలకంగా వ్యవహారిస్తున్నారు. కేంద్ర పెద్దల ఆశీర్వాదం, రాష్ట్ర పెద్దల సహకారంతో తాము అనుకున్న పనులను మంత్రి సత్యకుమార్ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నారు.. ఈ క్రమంలో వ్యూహత్మకంగానే తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరపినట్లు అనుకుంటున్నారు.. తిరుపతిలో బలిజలు, యాదవులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి కలిగి ఉన్న నేపథ్యంలో నూతన జిల్లా అధ్యక్షులు బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, మంత్రి యాదవ సామజిక వర్గానికి చెందిన వారు కావడం తిరుపతి లో బీజేపీ పట్టుపై పలు ఆలోచనలకు తావిస్తోంది.. తిరుపతిలో పట్టుకోసమే అందరివాడుగా, మంచి వ్యక్తిగా పేరున్న సామంచి శ్రీనివాస్ కు బీజేపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వెనుక మంత్రి సత్యకుమార్ వ్యహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది..

చిగురించిన ఆశలు..
బుధవారం తిరుపతిలో జరిగిన సామంచి శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీ పార్టీ లోను, కార్యకర్తలు, నాయకుల్లో ఆశలు చిగురింపచేసినట్లు చెప్పవచ్చు.. భారీ ర్యాలీ, భాహిరంగ సభను దిగ్విజయంగా నిర్వహించడం, సీనియర్ నాయకుల ఉద్వేగపూరిత ప్రసంగాలు, కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నామన్న భరోసా కార్యకర్తలు, నాయకులకు కలిగించినట్లయింది..ఎన్ డి ఏ భాగస్వామి గా ఉన్నందున త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులు,రానున్న తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలపై పలువురు ఆశలు పెంచుకుంటున్నారు…
