Uncategorized

వైజాగ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం

Spread the love

విశాఖలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

..పలు తీర్మానాలతో కూటమి ప్రభుత్వానికి నివేదిక

విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఎజే) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణలు తెలిపారు. మంగళవారం అక్కయ్యపాలెం కూడలిలోని ఓ ప్రయివేటు హోటల్లో విశాఖ జిల్లా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు, పి. నారాయణ్ లు మాట్లాడుతూ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ 2..లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభం కానుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. సమావేశంలో తాము ఐదు తీర్మానాలను ప్రవేశ పెట్టి, వాటికి రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తీసుకుంటామన్నారు. ఇందులో ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయడంతోపాటు జర్నలిస్టుల సంఘాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రమాద బీమా వెంటనే పునర్దురించాలని, 11 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరగా అమలు చేయాలని, పార్లమెంటులో చర్చించిన విధంగా ఏపీలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, చిన్న, మధ్య తరహా పత్రికలకు ఎంప్యానెల్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కు నివేదిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర మహాసభలకు ఆయా నేతలను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. గురువారం నాటి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులతోపాటు పలు జిల్లాలకు చెందిన ముఖ్య కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ఎస్. ప్రసాద్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రంగధామం ఉపాధ్యక్షులు ఆనంద్,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్
విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్, అసోసియేషన్ ప్రతినిధులు మళ్ల త్రినాధ్, డిపి నాయుడు, జి ఆర్ ఎస్ రమేష్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, కె.వి శర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *