Uncategorized

చెట్లతోనే మానవాళి మనుగడ…మంత్రి సవిత

Spread the love

చెట్లతోనే మానవాళి మనుగడ

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • హరితాంధ్ర ప్రదేశ్ కోసం కోటి మొక్కలు నాటుతున్నాం
  • ఏపీలో 2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం
  • నాటిన మొక్కల పరిరక్షణ బాధ్యత అందరిదీ…
  • చెట్లు తొలగిస్తే కఠిన చర్యలు : మంత్రి సవిత హెచ్చరిక

పోరంకి/కృష్ణా : చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని, హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం & వన మహోత్సవం సందర్భంగా గురువారం పోరంకిలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపుదలకు కట్టుబడి ఉన్నామంటూ స్థానికులతో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్టుతోనే మానవాళి మనుగడ సాధ్యమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి హరితాంధ్ర ప్రదేశ్ ఆవిష్కరణకు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం 30.5 శాతం ఉందన్నారు.ప్రతి ఏటా రాష్ట్రంలో పచ్చదనం 1.50 శాతం పెంచేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు. 2033 నాటికి 37 శాతం, 2047 నాటికి 50 శాతానికి పచ్చదనం పెంచేలా లక్ష్యంగా నిర్ణయించారన్నారు. నాటే ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారరు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. అదే సమయంలో పచ్చదనం పెంపుదలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

చెట్లు తొలగిస్తే కఠిన చర్యలు

రోడ్డుకిరువైపులా, కాలువ గట్లపై ఉన్న చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. పర్యావరణానికి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. చెట్ల పెంపకం బాధ్యత అందరిదన్నారు. ప్రతి ఇంటి ముందు, శుభ కార్యానికీ మొక్కలు నాటేలా అందరూ ముందుకు రావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

చెట్లు తొలగించిన జగన్

మనిషికి ప్రాణావాయువు అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే చెట్ల పెంపకం కోసం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధిక ప్రాధాన్య మిస్తున్నారి మంత్రి సవిత వెల్లడించారు. 2014-19 సమయంలోనూ సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ప్యాలెస్ దాటి పర్యటనకు వచ్చినప్పుడు గాల్లో తిరిగిన జగన్… రోడ్డుపై ఉండే చెట్లు తొలగించారని మంత్రి సవిత మండిపడ్డారు. అంతకుముందు వనమహోత్సవంలో పాల్గొనడానికి పోరంకి వచ్చిన మంత్రి సవితకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి గురమూర్తి, ఈశ్వర్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *