Uncategorized

వైకాపా ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం కుదేలు

Spread the love

సూపర్ సిక్స్‌తో‌ సూపర్ హిట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిన శక్తి చంద్రబాబుది

గత అయిదేళ్ల వైసీపీ ఆర్ధిక విధ్వంసంతో రాష్ట్రం కుదేలు

అభివృద్ధి, సంక్షేమం సమపాలళ్లలో రాష్ట్ర ప్రజలకు అందించిన పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు

అనంతపురం సభ రాష్ట్ర పునరుద్దరణకు అభివృద్ధికి, సుపరిపాలనకు సంకేతంగా నిలవనుంది

తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమ, విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు

(అనంతపురం జిల్లా, రాయదుర్గం: 09 సెప్టెంబర్ 2025, pvginox.com )

అనేక ఆర్ధిక సవాళ్లున్నా ఊహించని స్ధాయిలో సంక్షేమం అభివృద్ధి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పార్టీ కార్యకర్త సమావేశం పార్టీ  కార్యాలయంలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పరిశీలకులుగా మాజీ మంత్రి దేవినేని ఉమ, రైతు కమిషన్ వైస్ చైర్మన్ మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక రాయదుర్గం మున్సిపల్ టిడిపి నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, గత పాలకులు చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. వ్యవస్ధలు ధ్వంసమయ్యాయి. అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లోను హేళనగా మాట్లాడిన దుస్ధితి, అనేక ఆర్ధిక సవాళ్లున్నా ఊహించని స్ధాయిలో సంక్షేమం అభివృద్ధి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారన్నారు. ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలోనే ఇప్పటివరకు 42 వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం సంయుక్త నిర్ణయాలతోనే ప్రజాపాలన సాగిస్తున్నాయన్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో లక్షకోట్లకు పైగా సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరిందన్నారు. అలాగే ప్రభుత్వంగా ఇప్పటి వరకూ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి బహిరంగ సభ ద్వారా ప్రజలకు చెప్పాలని కూటమి అగ్రనాయకత్వం భావిస్తోందన్నారు. అనంతపురం సభ కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు. ఇది రాష్ట్ర పునరుద్దరణకు అభివృద్ధికి, సుపరిపాలనకు సంకేతంగా నిలవనుందన్నారు. రాయదుర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కాలువ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *