ఆటోనగర్ ఇండస్ట్రీయలిస్ట్స్ తో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన, ఎంపి కేశినేని సమావేశం
జి.వో నెంబర్ 5,6 రద్దు , ట్యాక్స్ తగ్గించేందుకు కృషి
విజయవాడ : ఆటోనగర్ లో నెలకొని వున్న సమస్యలు పరిష్కరించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ మందడుగు వేశారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో ఆటోనగర్ ఇండస్ట్రీయలిస్ట్స్ తో ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జి.వో నెంబర్ 5,6 రద్దు అంశం, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, సెట్ బ్యాక్ ట్యాక్స్ రద్దు అంశం చర్చకు వచ్చింది. తక్షణం ఎంపి కేశినేని శివనాథ్ ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తో మాట్లాడి సాయంత్రం తన కార్యాలయంలో ఆటోనగర్ ఇండస్ట్రీయలిస్ట్స్ తో సమావేశం ఏర్పాటు చేయించారు.
ఈ సమావేశంలో ఆటోనగర్ పారిశ్రామిక వేత్తలు జి.వో నెంబర్ 5,6 వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి రద్దు చేయాల్సిందిగా ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు విజ్ఞప్తి చేశారు. అలాగే ఓపెన్ ల్యాండ్ పై, సెట్ బ్యాక్ పై రెండ వందల శాతం వున్న పన్ను, పదహారు వందల శాతం ఏపీఐఐసీ చేసిందని , ఆ ట్యాక్స్ ను తగ్గించాలని సంస్థ చైర్మన్ మంతెన రామరాజు ను కోరారు. ఆటోనగర్ ఆటోమొబైల్ పారిశ్రామిక వేత్తలు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ ప్రెసిండెంట్ బాయన వెంకట రావు, ప్రెసిడెంట్ దోనేపూడి దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ ఎమ్. రామచంద్రరావు, జె.ఆర్.డి టాటా ఇండస్ట్రీస్ ఎస్టేట్ సోసైటీ చైర్మన్ వినోద్ బాబు, విజయవాడ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సెక్రటరీ టి.నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు జి. సాంబశివరావు,పి.శ్రీరామప్రసాద్, పి.రమేష్ బాబు, అమరనాథ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
