
సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు
• రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు
• రూ. 1,120 కోట్లు విడుదలకు హామీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు
శాసన మండలి సమావేశంలో గ్రామ పంచాయతీలకు ఉద్దేశించిన ఆర్థిక సంఘం గ్రాంట్లను ఇకపై వాటి ఉద్దేశించిన ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చూస్తుందని నేను సభకు హామీ ఇచ్చాను. గత ప్రభుత్వం అటువంటి నిధులను ఇతర పథకాలకు మళ్లించింది. ఈ రీతిలో నిధులను మళ్లించేయడం వల్ల స్థానిక సంస్థలపై ఆర్థిక భారం ఏర్పడింది. గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. జీతాల చెల్లింపులలో జాప్యం కూడా జరిగింది.
రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సకాలంలో విడుదల చేసినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. కమిషనర్, పంచాయతీరాజ్ కార్యాలయాన్ని ఈ నిధుల అంశంపై ఆగస్టు 5న సర్పంచ్లు సంప్రదించారు. పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను సెప్టెంబర్ మొదటి వారంనాటికి అన్ని పంచాయతీలకు విడుదల చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. స్థానిక పాలనకు సాధికారత కల్పించాలనే ముఖ్యమంత్రి గారి నిబద్ధత ఈ హామీ ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం… బాధ్యతాయుతమైన, ప్రజా-కేంద్రీకృత నాయకత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది.
ఆర్థిక సంఘం నిధుల విడుదల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్లకీ, స్థానిక సంస్థలకు గొప్ప ఉపశమనం కలుగుతుంది. సభలో హామీ ఇచ్చినట్లుగానే- ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు మాత్రమే ఉపయోగిస్తూ, వాటిని సద్వినియోగపరచాలనే దృఢమైన వైఖరిని మా ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ, గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థంగా అందించాలన్నదే మా ఉద్దేశం. గ్రామ పంచాయతీలను శక్తివంతంగా చేయాలని సంకల్పించాము.
పవన్కళ్యాణ్
డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్
