
శ్రీకాళహస్తిలోని సరస్వతీ ఆడిటోరియం నందు నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతనంగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సామంచి శ్రీనివాసులుని కోలా ఆనంద్ ఘనంగా దేవస్థాన శేషవస్ట్రం కప్పి, గజపూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మరియు బిజెపి నాయకుల సహకారంతో తాను తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనని తెలియజేశారు. తాను కూడా 24 × 7 కోలా ఆనంద్ లాగ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.

ఈనెల 18 వ తేదీన తిరుపతిలో ఛక్రీ హోటల్ నందు నిర్వహించే మండల అధ్యక్షులు సమావేశానికి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారు వస్తున్నారని ఆ సమావేశాన్ని జయప్రదం చేయడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బిజెపి నాయకులంతా కృషి చేయాలని కోరారు. తదుపర కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి కోసమే శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 294 పోలింగ్ బూత్ కమిటీలను మరియు 5 మండలాల కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపథంలో ముందుకు తీసుకుపోవాలని కోలా ఆనంద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు చంద్రప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమ, జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో – కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ఎస్వీ రమణ, బీడీ బాలాజీ, కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు ఆర్. హరీష్ రెడ్డి, వేడం కృష్ణయ్య, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, తిరుమలశెట్టి నరేష్, బగీర్తి వెంకటేష్, గరికపాటి రమేష్, కునాటి నాగరాజు, సొట్ట సుకుమార్, చిలకా రంగయ్య, కుప్ప ప్రసాద్, ధర్మయ్య యాదవ్, మద్దు వాసు యాదవ్, అమర్నాథ్, రామ్ ఉమా సింగ్, ప్రజ్ఞశ్రీ,, జాన్ మధుకర్, శ్యామ్ చంద్ గెహ్లాట్, అన్నపూర్ణమ్మ, లింగాబట్టినా గోపాల్, కోనేటి అయ్యప్ప, మోదుగుల నాగరాజు, చెందు రాయల్, నాగ శేషు, రాజా రాయల్, భీమవరం నరేష్, కనపర్తి రవి తేజ రాయల్, బిందు కుమార్, డిల్లీ, సిద్ధూ, కండ్రిగ యాతీంద్ర రెడ్డి, మునివేలు, మునిరాజా, చంద్రయ్య, షణ్ముగం, నరేంద్ర, యుగంధర్, డిల్లీ కుమార్ రెడ్డి, చెంగల్రాయులు రెడ్డి, సుధాకర్, సజ్జలు హరీష్, భరత్ కుమార్ నాయుడు, పుచ్చకాయలు రమేష్, రవి అచ్చారి, పెంచల్ నాయుడు, నానీ, గిరిధర్ సాయి, చైతన్య, కుమార్, అబ్దుల్లా, శాద్విక్, నరేష్, శివా, రాఘవులు, నారాయణ, తిమ్మీళ్ల ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
