Uncategorized

అందరికీ వైద్యం.. అదే లక్ష్యం… మంత్రి సత్యకుమార్..

Spread the love

శ్రీ సాయి ఎస్వి డయగ్నోస్టిక్స్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి

పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యం

మంత్రి సత్య కుమార్ యాదవ్

వైద్య రంగాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారు

నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాం

తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యమే లక్ష్యం

అన్ని వైద్య పరీక్షలు ఒకే చోట అందాలన్నదే ముఖ్య ఉద్దేశం

ఎస్వి డయాగ్నస్టిక్స్ అధినేత డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు
(THIRUPATHI, FEBRUARY 4th, 2025,pvginox.com )

స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో నూతనంగా పునః ప్రారంభించిన శ్రీ సాయి ఎస్వి డయాగ్నస్టిక్స్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ ప్రారంభించారు.ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు ఎస్వి డయాగ్నస్టిక్స్ అధినేత,ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు అప్నా మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దగ్గు మాటి శ్రీహరిరావు పురోహితులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు.వైద్య ఆరోగ్యశాఖలో నూతన వరవడిని తీసుకురావడం జరిగిందని,ప్రతి ఒక్క పేదవారికి కార్పొరేట్ వైద్యం తప్పక అందిస్తామని ఆయన సూచించారు.

ఇటువంటి శుభ తరుణంలో అన్ని సదుపాయాలతో ఎస్వి డయగ్నోస్టిక్స్ ను తిరుపతిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.పేద రోగులకు తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు.అనంతరం డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ గత నెల 29వ తేదీన కొన్ని అనివార్య కారణాల వలన రాలేకపోయిన మంత్రి,నేడు విచ్చేసి శ్రీ సాయి ఎస్వి డయగ్నోస్టిక్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మంచి వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ముందుందన్నారు.రాష్ట్రంలోని పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని,అందుకు నా వంతు సాయంగా సహకారాలు అందిస్తానన్నారు.అతి తక్కువ ఖర్చుతో మెరుగైన డయగ్నోస్టిక్స్ సేవలు అందించాలన్నదే తన ముఖ్య ఉద్దేశం అని,అందులో భాగంగానే ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు అందిస్తున్నానని తెలిపారు.గత 27 సంవత్సరాల క్రితం చిన్న అల్ట్రా సౌండ్ స్కాంప్ ప్రారంభించిన నేను డయగ్నోస్టిక్స్ సెంటర్ ను ప్రారంభించి నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. అందులో భాగంగానే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి త్రీడి అల్ట్రాసౌండ్ తీసుకురావడం జరిగిందని తెలిపారు.నేడు అన్ని డయాగ్నోస్టిక్స్ తో పాటు రేడియాలజీకి సంబంధించిన లేబరేటరీ మొదలగునవి ఒకే చోట ఉండడం వలన రోగికి వ్యాధి నిర్ధారణ సులువుతుందని,ద్వారా రోగికి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేందుకు వీలుంటుందన్నారు.అన్ని సదుపాయాలు కలిగిన ఈ డయాగ్నోస్టిక్స్ ప్రారంభించడం వలన ప్రతి పేదవానికి నూతన టెక్నాలజీతో పరీక్షలు అందించాలన్న తన లక్ష్యం సులువయిందన్నారు.గత 27 సంవత్సరాలుగా వైద్యంలోనూ రాజకీయంలోనూ సేవా కార్యక్రమాలలోనూ నాకు తోడ్పాటునందిస్తున్న ప్రతి ఒక్కరి సహకారంతో మరింతగా రాణించగలనని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్,జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, ఏపీయూఎఫ్ఐడిసి డైరెక్టర్ చందనా స్రవంతి,డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్,స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి కుమార్, , అప్నా.నర్సింగ్ హోమ్స్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, కోశాధికారి ఆదినారాయణ ఐఎంఏ ఎలెక్టెడ్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరాజు,ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ బాబ్జి శ్యాంసుందర్,తిరుపతి అధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు,తిరుపతి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి,కార్యదర్శి డాక్టర్ శ్యాంబాబు, మాజీ అధ్యక్షులు డాక్టర్ జనార్దన్, డాక్టర్ రవి రాజు,మాజీ కార్యదర్శి డాక్టర్ యుగంధర్,రుయా ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ, మణికర్ణిక హాస్పిటల్ అధినేత డాక్టర్ మణికర్ణిక,శ్రీ సాయి సుధా హాస్పిటల్ అధినేతలు డాక్టర్ సుధారాణి,డాక్టర్ సుకుమార్, డాక్టర్ సునీత,డాక్టర్ సోమేశ్,డాక్టర్ అన్వేష్, డాక్టరు తేజ..డాక్టరు నరేష్ టిడిపి టౌన్ ప్రెసిడెంట్ చిన్నబాబు, డాక్టర్ శివశంకర్ బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ అగ్రికల్చరల్ కాలేజీ డాక్టర్ భాస్కర్ రావు. ఎస్వీ మెడికల్ కాలేజీ నుండి..మురళీ… ఎస్వీయూ నుండి మురళీ కృష్ణ.. చెంగయఏపీ హంస జిల్లా అధ్యక్షులు రాజ, సంస్కృత ప్రొఫెసర్ డాక్టర్ కోటేశ్వర రావు, చెంగయ సిబ్బంది కవిత, నందినీ, రాజీవ్,జీవరత్నమ్మ, రమణ,శివ.. బాలాజీ.. ప్రముఖ వైద్యులు, కుటుంబ సభ్యులు.తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *