Uncategorized

అవుట్బొ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగాలి… మంత్రి నారాయణ ను కలిసిన ఏపీ జేఏసీ

Spread the love

pvginox.com



👉 ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

👉 ఆప్కాస్ లో ఉన్న లోపాలను సరిదిద్ది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలి…

👉 సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి

👉 ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి.

👉 ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని గౌః మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మరియు ఆప్కాస్ పై అధ్యయన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు శ్రీ పి నారాయణ గారిని కోరిన జేఏసీ అమరావతి మరియు కాంట్రాక్ట్ & అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం

>
♦️బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు, ఏపీ జేఏసీ అమరావతి

♦️కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుమన్ & ఈ.మధు బాబు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు మేలు జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి కారణం గతంలో 2014- 19 సంః కాలంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 50% శాతం పెంచి వారిని ఆదుకున్న చరిత్ర ఉంది. అలాగే ఇప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం అప్కాస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిదిద్ది, ఇంకా మెరుగైన సేవలు అందేలా, ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి న్యాయం చేయాలని విజయవాడలో నేడు తేదీ 24.6.2025 ఉదయం 10.30 గంటలకు గౌరవ మున్సిపల్ శాఖామాత్యులు మరియు ఆప్కాస్ పై అధ్యయన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేస్తూ లేఖ ఇచ్చినట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ శ్రీ బొప్పరాజు, స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీ పలిశెట్టి దామోదర్ రావు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుమన్ & ఈ.మధు బాబు లు తెలిపారు.

అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మంత్రి వర్గ ఉపసంఘం నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న సుమారు రెండున్నర లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్ది, అందరిని అప్కాస్ పరిధిలోకి తీసుకు వెళ్ళి, అంతకంటే మెరుగైన సేవలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందేలా చూడాలని, తద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అందరికీ ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు కూడా పెంచే ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలని వారు ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాత విధానాన్ని (ప్రైవేటు ఏజెన్సీలు) ప్రోత్సహించకుండా చూడాలని కోరారు.

🚩 ఈ ప్రైవేట్ ఏజెన్సీల వలన గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోయారని, కనీసం జీతాలు కూడా సక్రమంగా చెల్లించకపోవడమే కాకుండా ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా ఏజెన్సీలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఉద్యోగుల జీతాలు ప్రైవేట్ ఏజెన్సీలు తినేసిన సంఘటనలలో ప్రభుత్వాలు పీడీ చట్టం అమలు చేసి రికవరీ చేయాలని ఆదేశించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైయున్న సంస్థ (ఆప్కాస్), దీనివలన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కొంత మేలు జరిగినప్పటికీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సి ఎఫ్ ఎం ఎస్ లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ వారికి, వారి కుటుంబానికి అందవలసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు పరిచినారు. దీనివలన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయినారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి కమిటీ మరియు సిఎస్ గారి కమిటీ ఇరువురు కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచాలని సిఫారసు చేస్తే, గత ప్రభుత్వం కేవలం 23% మాత్రమే పెంచి వారికి తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాలలో అనేక విజ్ఞప్తి పాత్రాలు ఇచ్చినప్పటికిని ఒక్కటి కూడా సమస్య పరిష్కారం కాలేదు.

హెచ్ఆర్ పాలసీ;
అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పన లో భాగంగా మెప్మా/ స్పెర్స్ ఉద్యోగులకు మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని కోరారు. ఆ రెండు సొసైటీ యాక్ట్ కింద ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ సంస్థలు (మెప్మా, స్పెర్స్) అయినప్పటికీ వాటిల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తుండగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు.

సర్వీస్ రూల్స్;
ప్రభుత్వం పార్ట్ టైం ఉద్యోగులైన అంగన్వాడి వర్కర్స్, గ్రామ రెవెన్యూ సహాయకులు, ఆశా వర్కర్లు తదితరులకు ప్రభుత్వం సర్వీసు రూల్స్ ను ఏర్పాటు చేసి ఆదుకున్నారు. కానీ పూర్తి కాలం (ఫుల్ టైమ్) ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇన్ని సంవత్సరాలుగా కనీసం సర్వీస్ రూల్స్ లేకపోవడం చాలా బాధాకరం. కనుక ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం సర్వీస్ రూల్స్ (నియమ నిబంధనలు) ఏర్పాటు చేసి, తద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

అదనపు బెనిఫిట్
(ఇంక్రిమెంట్లు);
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికిని సీనియర్ కి జూనియర్ కి తేడా అంటూ లేకుండా ఒకే ప్రాతిపదికన జీతాలు ఇవ్వటం జరుగుతుంది. నిన్న చేరిన ఆఫీసు సబార్డినేట్ కు నెలకు 15000/- ఇస్తే, 20 సంవత్సరాల క్రితం చేరిన ఆఫీసు సబార్డినేట్ కు కూడా ఇప్పటికి నెలకు 15000/- మాత్రమే జీతం వస్తుంది. కనుక సీనియార్టీ ప్రాతిపదికన కనీస సర్వీస్ నిబంధన పెట్టీ, సంవత్సరం లేదా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అదనపు బెనిఫిట్ (ఇంక్రిమెంటు) ఇవ్వాలని కోరడం జరిగినది.

సంక్షేమ పథకాలు వర్తింపు;
గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ సంక్షేమ పథకాలు కూడా వర్తించేవి. కానీ, గత ప్రభుత్వ హయాంలో అప్పటివరకు వర్తిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిగా ఆపేశారు. అంతటితో ఆగకుండా వారి తల్లి తండ్రులకు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా నిలిపివేయడం చాలా చాలా బాధాకర విషయం.

అయితే, కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేసి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరిగినది.

కనీస మెడికల్ లీవ్స్;
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైన వేతనంతో కూడిన 30 రోజులు మెడికల్ లీవ్స్ ఇవ్వాలని కోరడం జరిగినది.

పైన పేర్కొన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలతో కూడిన విజ్ఞప్తిపై గౌః మున్సిపల్ మంత్రివర్యూలు శాఖామాత్యులు మరియు ఆప్కాస్ పై అధ్యయన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు స్పందిస్తూ… మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ న్యాయం జరిగేలా చుస్తామని తెలిపారు. అంతేకాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న విధంగా ప్రభుత్వానికి ఆప్కాసును రద్దు పరిచే ఆలోచన లేదని తెలిపారు.

ఈ సందర్భంగా బొప్పరాజు గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, మెరుగైన సేవల కోసం నిర్వహించే సమావేశాల్లో ఉద్యోగ సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలని, తద్వారా ఉద్యోగ సంఘాల సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరగా, గౌ||మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు.

ఈకార్యక్రమంలో స్టేట్ మున్సిఫల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు తిమ్మసెట్టి నాగేశ్వరరావు, సిటి జేఏసి చైర్మన్ పి.రవి ప్రసాధ్, ఔట్ సోర్శింగు అసోషియేషన్ అసోషియేట్ చైర్మన్ పసుపులేటి సివసైదారావు, కోశాధికారి సి.హెచ్.రమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ కేశవ తధితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *