Uncategorized

ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేటి స్వాతంత్య్రం.. ఎమ్మెల్సీ పిడుగు.హరిప్రసాద్

Spread the love

(pvginox.com By PALLA VENUGOPAL )

  • ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేటి స్వాతంత్య్రం – శ్రీ పి.హరిప్రసాద్, విప్, శాసన మండలి

భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ వేడుకలో పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించి, ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది అంటే కారణం శ్రీ సుభాష్ చంద్రబోస్, శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్, శ్రీ భగత్ సింగ్ లాంటి మహానుభావుల త్యాగాలే. వాళ్లు ఆనాడు చేసిన రక్త తర్పణం ఫలితమే ఈ రోజు మనం సాధించిన ప్రగతికి కారణం.

  • వారి స్ఫూర్తితోనే 100% స్ట్రైక్ రేట్‌తో విజయం
    దేశం కోసం సర్వస్వం తర్జిచ్చి, ప్రాణ త్యాగాలు చేసిన జాతీయ నాయకుల ఆశయాలు, ఆలోచనలే ఆలంబనగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. వారి ఆశయాలతో ముందుకు వెళ్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతాలను ప్రజలు బలంగా విశ్వసించారు కాబట్టే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అపూర్వమైన విజయం సాధించింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ఫూర్తి జన సైనికులు, వీరమహిళలలో రగిల్చారో … అదే స్ఫూర్తి, త్యాగనిరతిని మేమంతా ముందుకు తీసుకెళ్తామ’ని అన్నారు.
    రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఎందరో పోరాట వీరుల త్యాగాల ఫలితంగానే.. మనమంతా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నాం. స్వాతంత్య్రం పట్ల, సమమరయోధుల త్యాగాల పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతలో ఎంతో స్ఫూర్తిని రగిల్చారు. ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తామ’న్నారు.
    ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు శ్రీ బేతపూడి విజయశేఖర్, శ్రీ దాసరి కిరణ్, శ్రీ గంజి చిరంజీవి, శ్రీ చందు సాంబశివరావు, శ్రీ కప్పెర కోటేశ్వర రావు, శ్రీ అర్షద్, శ్రీ వికృతి శ్రీను, శ్రీ కె.ఎస్.ఎన్.మూర్తి, శ్రీ దాశరథి, వీర మహిళ నేతలు శ్రీమతి పార్వతి నాయుడు, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, శ్రీమతి తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *