Uncategorized

కాకాణి బాడీ మసాజ్ చేసుకుంటూ దొరికిపోయాడట.. సోమిరెడ్డి

Spread the love

కాకాణి కేరళలో బాడీ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడంట

గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేకుండానే అక్రమ మైనింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతారా

టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడు..జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదు

ఐదేళ్లూ లెక్కకు మించి పాపాలు చేశాడు..ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు

పొదలకూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేరళలో పోలీసులకు చిక్కాడని ఈ రోజు సాక్షి పత్రికలో చదివా

కేరళలో సేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట..

అక్కడ ఒక బాడీ మసాజ్ సెంటర్ లో దొరికాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది

ఇప్పటి వరకు 55 రోజులుగా అజ్ఞాత వాసం…ఈ రోజు నుంచి జైలు వాసం గడపబోతున్నాడు

గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు

కాకాణికి సంబంధం లేకుండా వరదాపురం రుస్తుం నుంచి 60 వేల టన్నుల క్వార్ట్జ్ తరలిపోయిందా

మొగళ్లూరు, డేగపూడిలో అక్రమ మైనింగ్, తోడేరులో డంపింగ్ గోవర్ధన్ రెడ్డికి తెలియకుండానే జరిగాయా

మంత్రిగా వ్యవహరించిన కాకాణి ప్రమేయం లేకుండా ఆయన సొంత మండలం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్, డంపింగ్ జరిగాయా

జీపీఎస్ లొకేషన్ ఆధారంగా పక్కా ఆధారాలతో అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేశాం..భారీ యంత్రాలు, పేలుడు పదార్దాలు, డంపర్లను మీడియాకు చూపించాం

కలెక్టర్, ఎస్పీ నుంచి సీఎస్, డీజీపీ వరకు, చివరకు ప్రధాన మంత్రికి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదులు పంపాం

ప్రధానమంత్రి కార్యాలయం స్పందించిన తర్వాత వరదాపురంలో మైనింగ్ ఆగింది…

ఇవన్నీ అబద్ధమని వైసీపీ నాయకులు చెబుతారా

ప్రత్యక్ష సాక్ష్యాలు, పక్కా ఆధారాలతో నమోదు చేసిన కేసులో ఈ రోజు కాకాణి ముద్దాయిగా ఉన్నాడు

వైసీపీ ఐదేళ్ల పాలనలో గోవర్ధన్ రెడ్డి సాగించిన అరాచకాల్లో ఈ అక్రమ మైనింగ్ దందా ఒక భాగం మాత్రమే

2014 నుంచే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేరాలు – ఘోరాలు, దందాలు కొనసాగుతున్నాయి..

2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత కాకాణి అవినీతి, అరాచకాలు, దందాలకు అంతే లేకుండా పోయింది

చేసిన పాపాలకు ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడు

టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మందిపై తప్పుడు కేసులు బనాయించి రోజుల తరబడి జైల్లో పెట్టించాడు..

చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టకుండా జైలుకు పంపించాడు

ఆ రోజు జైళ్లలో మగ్గిపోయిన వారికి కుటుంబాలు లేవా…భార్యాపిల్లలు లేరా

నాపై 18 అక్రమ కేసులు పెట్టించాడు..మా పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధించాడు..ఆస్తులను ధ్వంసం చేయించాడు

కోడూరులో రొయ్యల గుంతలు ధ్వంసం చేయించి రూ.1.50 కోట్ల విలువైన రొయ్యలను సముద్రంలోకి వదిలిపెట్టించాడు

కంటేపల్లిలో సెల్ ఫోన్ టవర్లు, చెముడుగుంటలో లారీ కాటా కూలగొట్టించాడు. నల్లబాళెంలో పైపులైన్లు ధ్వంసం చేయించి 15 ఎకరాల సంపంగి తోటల్ని బీడు పెట్టించాడు

పొదలకూరులో దుకాణాల ముందు పట్టలు వేసుకున్నారని 16 మంది ఆర్యవైశ్యులను 14 రోజులు జైలులో పెట్టించాడు

కాకాణి సాగించిన భూదందాకు అండగా నిలిచిన ముగ్గురు తహసీల్దార్లు, 10 మందికి పైగా రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయ్యారు..వేలాది ఎకరాల భూముల రికార్డులు మారిపోయాయి

ఒక్క సర్వేపల్లిలో తప్ప జిల్లాలోని మరే నియోజకవర్గంలో ఈ స్థాయిలో అరాచకాలు జరగలేదు

తప్పుడు పనులు చేసి జైలుకు పోతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై వైసీపీ నేతలు సానుభూతి చూపడం దురదృష్టకరం

నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను ఘోరమైన భాషతో దూషించాడు

నేను మత్తు పదార్థాలు తీసుకుంటానంట..క్లబ్బుల్లో కూర్చుంటానంట..వళ్లు కొవ్వెక్కిపోయి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు

ఒకటికి రెండు సార్లు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుని వంటికి పట్టిన కొవ్వు తీయించుకున్నా పూర్తిగా కరగలేదు

ఇప్పుడు ఆ కేరళలో కొవ్వు తగ్గించుకునే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు

దేవాలయాలు లాంటి న్యాయస్థానాలున్నాయి..ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *