తెలియని నాకు కల్లోలమే…!!!

కుంచెతో గీసిన చిత్రమా
ఆత్రేయ రాసిన కవితా వనంలో
జాలువారిన కూనలమ్మకు రూపమా…
గానమా అనురాగమా హిమాలయాన
మానస సరోవరాన పూసిన పారిజాతమా
కలలు చూడనిది కనులు మెచ్చినది…
పదాల పిలుపుతో నా కవితకు ప్రాణమా
ఏమో తెలియని నాకు కల్లోలమే…
ఏ ఋషి తపస్సును
భంగపరుచుటకు సురలు పంపిన
మోహినీ అవతారమో లేక స్పర్శలేని
అప్సర చిందులకు అతకని సుకుమారమా
రాయంచ నడకలతో రాజసానివై…
కవి కంటిని చిలికిన ఏకాంతమవుతు
తెగిన వీణలకు పలుకువై వలపు
కాఠిణ్యాలకు మొగ్గవై పూస్తన్నావు…
ఏమో తెలియని నాకు కల్లోలమే…
మహిమవా మనుషుల లోకం
చెప్పుకొనే సువర్ణ సుందరి కథవా…
కళింద మడుగున మరిచిన మరళిని
చేతబూని ఎదురు తెన్నుల ఆస్వాధింపై
అడుగుల మెదగుతో అల్లంత దూరాన
కలహంసల కలివిడిని పిలుస్తున్నావు…
చూచినా మధికి దొరకని దొంగాటవై…
ఏమో తెలియని నాకు కల్లోలమే…
ఎవరివో ఏమో అయినా…
నా కందని ఎదలోతుల్లో ఏదో తెలియని
వెలితి నన్ను గుచ్చుతు చెబుతున్నది…
మంచికి తోడుగా చీకటికి వెలుగుగా
తోడునీడలతో అందానికి బంధమై…
ఈడుజోడులతో ఊహలకు రెక్కలు
కడితే ఈ ప్రపంచాన్నే చుట్టేయవచ్చని…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396
