
(10/09, 09:02 AMARAVATHI, pvginox.com )
మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు
నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న లోకేష్. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు, ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితి పై సమీక్ష, నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి రంగంలోకి దిగిన మంత్రి నేపాల్ లో ఉన్న భారతీయుల కొరకు భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు), రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నెంబర్లు.
నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు): +977 – 980 860 2881 / +977 – 981 032 6134 ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, EXT : 8001, 8005 మరియు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: he******@****ts.com మరియు in**@****ts.com,
లనైనా సంప్రదించగలరు.
