

ప్రాజక్టుల పురోగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్సు
అమరావతి, మే 28: దేశంలోని పలు ప్రాజక్టుల పురోగతిని సమీక్షిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవార డిల్లీ నుండి వీడియో కాన్పరెన్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంశాలు, ఆయూష్మాన్ భారత్ హెల్త్ ఇన్ప్ట్రాస్ట్రక్చర్ మిషన్ కార్యక్రమం, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రగతి, రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజక్టు పురోగతి, ఒడిస్సా ఇంటిగ్రేటెడ్ ఆనందపూర్ బ్యారేజ్ ప్రాజెక్టు పురోగతి మరియు సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా అంశంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మాడీ ఈ వీడియో కాన్పరెన్సులో సమీక్షింస్తున్నారు.
ఈ వీడియో కాన్పరెన్సులో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో పాటు ఆయా శాఖలు, ప్రాజెక్టులకు చెందిన ఉన్నతాధికారులు డిల్లీ నుండి పాల్గొనగా, రాష్ట్ర నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐ.టి.ఇ. అండ్ సి శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
