Uncategorized

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి లు కూటమివే.. మంత్రి నాదెండ్ల మనోహర్

Spread the love

(pvginox. com )

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమిదే విజయం

  • సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ రిపీట్ అవుతాయి
  • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు
  • వైసీపీ అధినేతవి దుర్మార్గమైన ఆలోచనలు
  • బెంగళూరు నుంచి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు
  • అన్నదాతల కడుపు నింపే పంటను రోడ్లుపై వేసి తొక్కించే మనస్తత్వం ఆయనది
  • హెలికాప్టర్ లోవచ్చి హడావుడి తప్ప… రైతులకు చేసింది ఏమీ లేదు
  • రైల్వేకోడూరు మార్కెట్ యార్డు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి విజయాన్ని కూటమికి అందించారో… అటువంటి విజయాన్నే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు అందిస్తారని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాలనూ అణగదొక్కారని, వాటన్నింటిని గుర్తుకు తెచ్చుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. సోమవారం రైల్వేకోడూరు మార్కెట్ యార్డు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి పగడాల వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ శ్రీ శివయ్య యాదవ్, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో అన్యాయాలకీ, అవమానాలకు గురయ్యాం. గతంలో ఈ ప్రాంతంలో సభ నిర్వహిస్తే ఎన్నో ఆంక్షలు విధించారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై ప్రశ్నించినందుకు సురేష్ అనే జన సైనికుడి చీనీ తోటను ధ్వంసం చేశారు. మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి నిర్భందించారు.
• దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి జగన్
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదు. ఆయన హయాంలో ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 113 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో 24 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మన ప్రాంతం వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే మనకు అండగా ఉంటాడని నిండు మనసుతో ఆశీర్వదిస్తే… ఆయన కౌలు రైతుల ఉసురు తీశారు. కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధవటంలో కార్యక్రమం నిర్వహిస్తే… ఆ కార్యక్రమానికి కౌలు రైతుల కుటుంబాలను రానీయకుండా బెదిరింపులకు దిగిన దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి ఆయన. వైసీపీ నాయకులు ఎంతలా బెదిరింపులకు దిగినా వారి బెదిరింపులకు లొంగకుండా ఆనాడు అతని ప్రాంతం నుంచి 17 కుటుంబాలు కార్యక్రమానికి హాజరయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన, కష్ట జీవుల పక్షాన నిలిచే నాయకుడు.
• పబ్లిసిటీ పిచ్చితో పంటను నాశనం చేశారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ బెంగళూరు నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఏదో ఒక సమస్య పేరు చెప్పి హెలికాఫ్టర్ లో వచ్చి నానా యాగీ చేసి వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డు దగ్గర ఇలాంటి హడావుడే చేశారు. వాళ్ల ఫోటోలు, వీడియోల కోసం… రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్లపై పారబోసి వాహనాలతో తొక్కించారు. నిజానికి ఆ ప్రాంతంలో మామిడి పండ్లు కొనుగోలు చేసే ముఠా వాళ్లదే. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏనాడు కూడా మామిడి రైతుల గురించి పట్టించుకోని జగన్ .. ఇప్పుడు కొత్తగా వారిపై ప్రేమ ఒలకబోశారు. అన్నదాతలకు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు రూ.200 కోట్లు భారాన్ని భరిస్తూ మామిడిని కొనుగోలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు 30 రోజుల్లో ఇళ్లు కట్టిస్తామని మాట ఇచ్చిన జగన్ ఏళ్లు గడిచినా మాట నిలబెట్టుకోలేకపోయారు. బాధితుల పక్షన కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. త్వరలోనే అధికార యంత్రాంగంతో మాట్లాడి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.
• ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. గత ప్రభుత్వ హయాంలో ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించాలో వాళ్లే నిర్ణయించే వారు. దాదాపు 80, 90 కిలోమీటర్ల దూరం ఉన్న రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులు ఏ మిల్లుకు కావాలంటే ఆ మిల్లుకు ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఖరీఫ్, రబీలో కలిపి రూ. 12 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెన్షన్ల కోసం ప్రతి నెల రూ.2800 కోట్లు కేటాయిస్తున్నాం. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నాం.
పంచాయతీరాజ్ వ్యవస్ధ ద్వారా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లెలో చేపట్టిన గ్రామ సభలో పాల్గొన్నారు. రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం.
• ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం
రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేయింబవళ్ళు అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమిలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి మనమంతా కలిసి పనిచేయాలి. వైసీపీ ఐదేళ్ల విధ్వంసాన్ని పూడ్చాలంటే… మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలి. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కష్టపడి వారికి మేలు చేసేలా పాలన అందిద్దాం. కొత్తగా ఏర్పడిన మార్కెట్ యార్డు కమిటీ రైతులకు అండగా నిలబడాలి. ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచన చేయాలి. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అవసరమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు ఇంఛార్జ్ శ్రీ రూపానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్త కళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ డా. పసుపులేటి హరి ప్రసాద్, జనసేన నాయకులు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ జయప్రకాశ్, శ్రీ పగడాల చంద్రశేఖర్, శ్రీ వెంకటేష్, శ్రీ జోగినేని మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *