Uncategorized

మావోయిస్టుల మృతదేహాలు తగలబెట్టడం అమానుషం……సిపిఐ

Spread the love

  • తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మావోయిస్టు నాయకుల మృతదేహాలను( ఇద్దరు మహిళా మావోయిస్టు లతో సహా), మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఛత్తిష్ ఘడ్ ప్రభుత్వం అక్కడి పోలీసులచే మూకుమ్మడిగా కాల్చివేయడం అమానుషం

ఈ నెల 21వ తేదీన చత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రం లోని నారాయణపూర్ జిల్లా మాడ్‌ ప్రాంతంలో భద్రతాదళాల కాల్పుల్లో చంపబడ్డ సీపీఐ మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు, సజ్జానాగేశ్వరరావు,రాకేష్,విజయలక్ష్మి, కర్నూలు జిల్లా ములుగుందం గ్రామానికి చెందిన లలిత తదితరుల మృతదేహాలను మృతుల బంధువులకు ఇవ్వకుండా పోలీసులే కాల్చివేయడం అమానుషమని, కనీస మానవీయ విలువలకు విరుద్ధం.దీనిని వ్యతిరేకిస్తూ CPI, CPM, POP,విరసం, SDPI, NEW డెమోక్రసీ, CPI( ML),RVV, KNPS ఇతర ప్రజా సంఘాల ఆధ్వరంలో స్థానిక CPI కార్యాలయములో పత్రికా విలేఖకరుల సమావేశం జరిగింది

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఛత్తిష్ ఘడ్ రాష్ట్రం నారాయణ పూర్ జిల్లా మాడ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు గత ఐదు రోజులుగా నారాయణపూర్‌లోని జిల్లా ఆసుపత్రి లో పడిగాపులు గాచినా వాళ్లకు మృతదేహాలను ఇవ్వకుండా పోలీసులే కాల్చివేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. కేంద్రంలోని, చత్తీస్‌ఘడ్‌లోని బీజేపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా, దుర్మార్గంగా తయారయ్యాయనడానికి ఈ ఎన్‌కౌంటర్‌ ఉదాహరణ అని పేర్కొన్నారు.పాకిస్తాన్ లో చర్చలూ జరుపడానికి సిద్దపడ్డ భారత ప్రభుత్వం ఈ దేశ పౌరులు అయిన మావోయిస్టు లతో చర్చలు జరుపకుండా ఇలా ఎన్కౌంటరు పేరుతో కాల్చి చంపడం దుర్మార్గ మైన చర్య అని పేర్కొన్నారు.ఈ మొత్తం ఘటన పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ చచ్చిన శవాలు కూడ నిజాలు చెపుతాయని భయపడి ఇలా చేయడం బీజేపీ కి ఒక అలవాటుగా మారింది అన్నారు.గతంలో ఉత్తర ప్రదేశ్ లో ఒక దళిత అమ్మాయి అత్యాచారానికి గురయినప్పుడు కుటుంబ సభ్యులకు తెలియ కుండ ఆమె శవాన్ని కూడ ఇలాగే కాల్చి వేశారని పేర్కొన్నారు.మృతుల శరీరాలు బంధువులకు ఇవ్వకుండ పోలీసులే కాల్చివేయడం అమానుష చర్య అని అన్నారు.

విరసం నాయకుడు పాణి మాట్లాడుతూ శవాలకు కూడ హక్కులు ఉంటాయని,మృతులు ఏ రంగానికి చెందిన వారయినా వారి మృత దేహాలకు అంత్య క్రియలు,అంతిమ సంస్కారములు నిర్వహించుకునే హక్కు ఆ తల్లులకు,కుటుంబ్బీకులకు ఉంటుందని అన్నారు.మృతుల శరీరాలు ఆంధ్ర ప్రదేశ్ కు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని మంత్రి అచ్చన్నాయుడు,శ్రీకాకుళం SP మహేశ్వరరెడ్డి నంబాల కేశవరావు కుటుంబ్బీకులను బెదిరించారని,దీన్ని బట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే ఉద్దేశ్య పూర్వకంగానే మృతుల శరీరాలు కుటుంబం వారికి అందుకుండ చేసిందని పేర్కొన్నారు.HIGH COURT ఉత్తర్వులు ఇచ్చి నప్పటికీ ఛత్తిస్ ఘడ్ ప్రభుత్వం COURT కూడ ధిక్కరించి శవాలను కాల్చివేసిందని తెలిపారు

. ప్రజాభ్యుదయ అధ్యక్షుడు . శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ప్రభుత్వాలు మధ్యయుగాల పాలకులకన్నా, రష్యాలోని జార్‌ చక్రవర్తికన్నా దుర్మార్గంగా తయారయ్యాయని, యుద్ధ నియమాల ప్రకారం ప్రత్యర్థి శిబిరానికి చెందిన సైనికుల మృతదేహాలను గౌరవించాలనే మానవీయ విలువలను చత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాలు ఉల్లంఘించాయని అన్నారు. మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సైనికులను మోహరించి ఈ హత్యాకాండకు పాల్పడిరదని, చివరికి మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు ఇవ్వకుండా వాళ్లను వేధించిందని అన్నారు.

పౌరహక్కుల సంఘం నాయకుడు అల్లా బకష్ మాట్లాడుతూ యుద్ధంలో మరణించిన వారి మృత దేహాలు సైతం శత్రు దేశాల వారికి గౌరవంగా ఇవ్వడం అంతర్జాతీయ న్యాయ సూత్రం మరియు,ఐక్యరాజ్య సమితి నిబంధన కూడ అని అన్నారు.రాజ్యాంగం, న్యాయస్థానాలు, కనీస మానవ విలువలు కూడ బీజేపీ,TDP మరియు కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదని పేర్కొన్నారు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం పుస్తకాల్లో తప్ప నిజంగా లేదు అని చెప్పారు

ఈ సమావేశంలో ఇంకా సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు వెంకటస్వామి, పిడిఎస్‌యూ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌, సీపీఐ సీనియర్‌ నాయకుడు రామచంద్రయ్య, జిల్లా నాయకుడు గిడ్డయ్య, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి, , రైతుకూలి సంఘం నాయకుడు సుంకన్న, ఎస్‌డీపీఐ నాయకుడు చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *